Crime: చిన్న పిల్లలను అడ్డుపెట్టుకోని చోరీలు…పుదుచ్చేరిలో అరెస్టైయిన ఇద్దరు తెలుగు మహిళలు
పుదుచ్చేరిలో చిన్నపిల్లలను ఎత్తుకోచ్చి చోరీలకు పాల్పడుతన్న పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
- By Hashtag U Published Date - 11:53 AM, Thu - 11 November 21

పుదుచ్చేరిలో చిన్నపిల్లలను ఎత్తుకోచ్చి చోరీలకు పాల్పడుతన్న పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆ బాలికతో కలిసి బస్సుల్లో చోరీకి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను పుదుచ్చేరి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి చిన్నారిని రక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఇద్దరు మహిళలు మంజు (34), లలిత (36)లను అక్టోబర్ 15 న కొత్త బస్టాండ్‌లో చోరీకి పాల్పడ్డారనే ఫిర్యాదుతో వీరిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు చిన్నారిని కిరాయికి ఇచ్చింనందుకు దుర్గ, జీవా అను దంపతులను నవంబర్ 9న అరెస్ట్ చేశారు. రెండు దొంగతనాల కేసుల్లో మంజు, లలిత నుంచి డబ్బు, నగలను పోలీసులు రికవరీ చేశారు.
పుదుచ్చేరి రోడ్డు రవాణా బస్సు (పీఆర్‌టీసీ)లో ఓర్లీన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కండక్టర్‌గా పనిచేస్తున్న వెల్విజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నేరం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్‌లో పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు తన దృష్టి మరల్చి పర్సులో ఉంచుకున్న రూ.10,500 దొంగిలించారని వెల్విజి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఓర్లన్‌పేట పోలీసులు ఇద్దరు మహిళలను పసిగట్టి చిన్నారితో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10,000, అలాగే కొద్దిరోజుల క్రితం ఓ బస్సు ప్రయాణికుడి నుంచి చోరీకి గురైన తొమ్మిది సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏత్తూరులో వారు ఇచ్చిన పేర్లు, నివాస చిరునామాలు అబద్ధమని గుర్తించిన పోలీసులు వారి మొబైల్ ఫోన్‌ల ద్వారా కాల్ చేసిన అన్ని ప్రాంతాలకు బృందాలను పంపి ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో వారి నివాసాన్ని గుర్తించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న బాబూజీ తెలిపారు.
ఈలోగా రిమాండ్ పొడిగిస్తున్న సమయంలో చిన్నారి మహిళలతో వెళ్లేందుకు నిరాకరించడం అనుమానాలకు తావిస్తోంది. నిందితురాలు ఆ చిన్నారి తల్లి కాదా అనే విషయంపై విచారణ చేయాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. ఇద్దరు మహిళల గ్రామంలో ఆరా తీస్తే ఇద్దరిలో ఎవరికీ బిడ్డ పుట్టలేదని తేలింది. విచారణలో ఇద్దరు మహిళలు తమ వ్యాపారంలో పెట్టుబడిగా చిత్తూరు జిల్లాకు చెందిన దంపతుల నుంచి బిడ్డను ‘కిరాయికి’ తెచ్చుకున్నట్లు చెప్పారని బాబూజీ తెలిపారు. పోలీసులు వెళ్లి దుర్గ, జీవా దంపతులను కలిశారు.గ్రామంలో విచారణ చేయాగా దుర్గ జీవాలకు ఆ బిడ్డ పుట్టలేదని వారు కూడా దత్తత తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే తాము దత్తత పత్రాలు లేదా పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా జీవసంబంధమైన తల్లిదండ్రుల పేర్లను సమర్పించలేకపోయామని బాబూజీ చెప్పారు. దీంతో దంపతులను అరెస్టు చేసి పుదుచ్చేరికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
దొంగతనానికి పాల్పడే సమయంలో బస్సులోని ప్రయాణికుల దృష్టి మరల్చేందుకు చిన్నారిని ఉపయోగించినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలిందని బాబూజీ తెలిపారు. దొంగతనం ద్వారా వచ్చిన డబ్బులు మంజు, లలిత దుర్గ, జీవాలు పంచుకున్నారు. ఈ నలుగురిపై బాలల అక్రమ రవాణా కింద ఐపీసీ 370(4), దొంగతనం కింద ఐపీసీ 379 కింద కేసులు నమోదు చేశారు.
Related News

Drugs : హైదరాబాద్‌లో ఏడుగురు డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసిన పోలీసులు
డ్రగ్స్ సరఫరా చేస్తున్నాఏడుగురిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం పట్టుకుంది. వారి వద్ద నుంచి 310