HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Explosion In Fireworks Unit In Tamil Nadu 10 People Killed

Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి

బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.

  • Author : Balu J Date : 10-10-2023 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4 killed In Fire
Fire

Tamil Nadu: తమిళనాడులోని అరియలూరు జిల్లా కీలపాలూరు సమీపంలోని విరగలూరు గ్రామంలో బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. యూనిట్ లోపల పేలుళ్లు దాదాపు మూడు గంటల పాటు కొనసాగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్టు సమాచారం.

పేలుడు సంభవించినప్పుడు శివకాశి, తిరువయ్యారు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులు బాణసంచా యూనిట్‌లో పని చేస్తున్నారు. క్షతగాత్రులను రెండు ఆసుపత్రుల్లో చేర్పించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

విరగలూరు గ్రామంలోని సౌత్ స్ట్రీట్‌కు చెందిన కె రాజేంద్రన్ (65)కి చెందిన లైసెన్స్‌డ్ యూనిట్ 2014 నుండి నడుస్తోంది. రాజేంద్రన్ బాణాసంచా యూనిట్‌కు కిలోమీటరు దూరంలో తంజావూరు-అరియలూరు రహదారిలో పటాకుల రిటైల్ దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ యూనిట్ పేలుడు పదార్థాలను తయారు చేసి గోడౌన్లలో నిల్వ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు సరఫరా చేస్తుంది. యూనిట్‌ను నిర్వహిస్తున్న రాజేంద్రన్‌, అతని అల్లుడు ఎ అరుణ్‌కుమార్‌ (40)ని అరెస్టు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 died
  • Bomb Explosion
  • firecracker
  • tamil nadu

Related News

PM Modi Extends Greetings to CM Vijay

CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர

  • Congress Party

    Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

Latest News

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

  • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd