Puneeth : ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!
- By Balu J Published Date - 02:57 PM, Sat - 13 November 21

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రోజులు గడుస్తున్నా కర్ణాటక ప్రజలు ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ ను గుర్తుకుతెచ్చుకుంటూ కన్నీరు పెడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అప్పు.. అప్పు అంటూ స్మరించూ దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల జరిగిన సంస్మరణ సభలోనూ ఆయన అభిమానులు రోదించడం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. కర్ణాటక ప్రజలు పునీత్ ను మరిచిపోవడానికి ఇంకొన్ని నెలలు కూడా పట్టొచ్చు.
#WATCH | Karnataka: The Forest Department has named a two-year-old elephant calf at Sakrebailu elephant camp near Shivamogga after actor Puneeth Rajkumar, who passed away recently. pic.twitter.com/RtHdJ1hRVU
— ANI (@ANI) November 13, 2021
తాజాగా పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. ఓ రెండేళ్ల మగ ఏనుగు పిల్లకు ‘పునీత్ రాజ్ కుమార్’ నామకరణం చేశారు బెంగళూరు చెందిన అధికారులు. ఈ సందర్భంగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగరాజ్ మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఈ ఏనుగుల శిబిరాన్ని తరుచుగా విజిట్ చేస్తుంటారు. మరణానికి కొద్దిరోజులు ముందే ఈ శిబిరంలో మూడు గంటలు గడిపారు. జంతువులను, పక్షులను ఎంతగానో ప్రేమిస్తారు. సాధారణంగా మేము వాటికి దేవుళ్లు, దేవతల పేరు పెడుతుంటాం. అయితే మా సిబ్బంది, స్థానిక ప్రజలు ఏనుగు పిల్లకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలని కోరారు. పునీత్ పేరు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారాయన.
#WATCH | "Puneeth Rajkumar had visited this camp & he was with us for more than 2 hours. He spent time with this elephant calf. After a request from staff, public, we named the calf after actor Puneeth," Deputy Conservator of Forest (Shivamogga wildlife division), Nagaraj said. pic.twitter.com/3jApz94VTE
— ANI (@ANI) November 13, 2021
Related News

BJP Politics : కర్ణాటకలో కమల రాజకీయం ఫలిస్తుందా?
కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి.