Mansoor Ali Khan : నటుడు మన్సూర్ అలీఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర..?
పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు
- By Sudheer Published Date - 09:54 AM, Fri - 19 April 24

మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) కొద్దీ రోజుల క్రితం ఈ పేరు మీడియా లో మారుమోగిపోయింది. నటి త్రిష (Trisha) ఫై ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యల ఫై యావత్ చిత్ర పరిశ్రమే కాదు కోర్ట్ లు సైతం సీరియస్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం ఈయన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వివాదం చాల రోజుల పాటు మీడియా లో వైరల్ అవుతూ వచ్చింది. ‘ఇండియా జననాయక పులిగళ్ పార్టీ’ ని స్థాపించిన ఈయన పార్టీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అనుమతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారని ఆయనపై అభియోగం రావడవంతో పార్టీ నుంచి మన్సూర్ ని తొలగించారు. ప్రస్తుతం ఆయన వేలూరు లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారం (Election Campaign)లో మునిగిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో విపరీతంగా ప్రచారం చేసారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే గుడియాత్తంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు. అందులో.. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారని, పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం..? ఈయన ఆరోపణల్లో నిజం ఉందా..? లేక ఓట్ల కోసం ఇలా ప్రకటించాడా ..? అనే కోణంలో అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Viral : బాలయ్య కు దండ వేసాడు..లక్కీ అనిపించుకుంటున్నాడు