HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Congress Suspends Kerala Mla Rahul Mamkootathil

Congress Suspended : కాంగ్రెస్ యువనేతకు భారీ షాక్..లైంగిక ఆరోపణలే కారణం

Congress Suspended : ఈ ఘటనపై రాహుల్ మామ్‌కూటథిల్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాట్సాప్ చాట్‌లు, ఫోన్ సంభాషణల ఆడియోలను బయటపెట్టి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించారు.

  • By Sudheer Published Date - 12:55 PM, Mon - 25 August 25
  • daily-hunt
Congress Suspends Mla Rahul
Congress Suspends Mla Rahul

కేరళ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్‌(Rahul Mamkootathil)పై లైంగిక ఆరోపణలు (Allegations) తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొదట నటి రిని జార్జ్ తనపై ఆయన మూడు సంవత్సరాలుగా లైంగిక వేధింపులు చేస్తున్నారని బయటపెట్టగా, అసభ్య సందేశాలు, అభ్యంతరకరమైన ఫోటోలు పంపడమే కాకుండా హోటళ్లలో రూములు బుక్ చేసి రావాలని తరచూ ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఆయన్ను పదవులు కట్టబెట్టారని ఆమె వాపోయారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, రాహుల్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

HYD – Amaravati : హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే- త్వరలోనే మార్గం ఖరారు?

ఆరోపణలు క్రమంగా పెరుగుతుండటంతో రాహుల్ మామ్‌కూటథిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే సమయంలో మరో ఆడియో క్లిప్ వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. అందులో ఆయన ఒక మహిళను గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేయడమే కాకుండా, మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు రికార్డు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటి కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. చివరికి పార్టీ నాయకత్వం ఆయనను ఆరు నెలల పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనపై రాహుల్ మామ్‌కూటథిల్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాట్సాప్ చాట్‌లు, ఫోన్ సంభాషణల ఆడియోలను బయటపెట్టి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించారు. మహిళను గర్భస్రావం చేయమని బలవంతం చేసిన ఆడియోను ఎవరో కావాలనే తయారు చేశారని ఆరోపించారు. ఇదే సమయంలో ఈ కేసును కేరళ మహిళా కమిషన్, బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. రాహుల్ భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Suspended
  • Kerala MLA Rahul Mamkootathil
  • Misconduct Allegations
  • MLA Rahul Mamkootathil

Related News

    Latest News

    • Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

    • Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

    • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

    • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

    • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

    Trending News

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

      • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

      • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd