AK Antony Vs Anil Antony : నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి : కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ
AK Antony Vs Anil Antony : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఆంటోనీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 03:33 PM, Tue - 9 April 24
AK Antony Vs Anil Antony : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఆంటోనీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేరళలోని పతనంతిట్ట లోక్ సభ స్థానంలో తన కుమారుడు అనిల్ ఆంటోనీని ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడం తప్పు అని ఏకే ఆంటోనీ(AK Antony Vs Anil Antony) కామెంట్ చేశారు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Kerala: On his son and BJP leader Anil Antony contesting elections from Pathanamthitta Lok Sabha seat, Congress leader AK Antony says, "BJP should lose there and Congress should win in Pathanamthitta. Anto Antony (Congress candidate) will win. Congress is my religion."… pic.twitter.com/xJKdAUoEVG
— ANI (@ANI) April 9, 2024
We’re now on WhatsApp. Click to Join
‘‘నా మతం కాంగ్రెస్ పార్టీ. దానికే సదా నా మద్దతు ఉంటుంది. తుదిశ్వాస దాకా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఏకే ఆంటోనీ తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ జాతీయ సమస్యలపైనే పోరాటం చేస్తుంటారు. ఇండియా కూటమి ప్రతిరోజూ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పతనం ఖాయం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు మంచి అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు.
Also Read :Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?
అనిల్ ఆంటోనీ బీజేపీలో ఎందుకు చేరారు ?
- అనిల్ ఆంటోనీ 2023 ఏప్రిల్‌లోనే బీజేపీ కండువా కప్పుకున్నారు.
- బీజేపీలో చేరకముందు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కో ఆర్డినేటర్‌గా అనిల్ కొనసాగారు.
- 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వ్యవహారంతో విభేదించి కాంగ్రెస్ పార్టీకి అనిల్ రాజీనామా చేశారు.
- ఏప్రిల్ 6న అనిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
- ఆ సమయంలో అనిల్ ఆంటోనీ తండ్రికే ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
- తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే పార్టీకి అనిల్ రాజీనామా చేశారు.
- ‘‘చాలా మంది కాంగ్రెస్ నేతలు ఓ కుటుంబం కోసం పని చేయడమే కర్తవ్యమని భావిస్తారు. కానీ ప్రజల కోసం పనిచేయాలని నేను నమ్ముతున్నాను’’ అని అనిల్ ఆంటోనీ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
Also Read : Stock Market 75000 : స్టాక్ మార్కెట్ రయ్ రయ్.. తొలిసారిగా 75000 దాటిన సెన్సెక్స్
Related News
Kalpana Soren : నామినేషన్ వేసిన మాజీ సీఎం భార్య.. బైపోల్లో గెలిస్తే సీఎం పోస్టు ?
Kalpana Soren : జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.