CM Stalin: అవయవ దానంపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన ప్రకటన చేసింది.
- Author : Balu J
Date : 23-09-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ రోజుల్లో అన్ని దానాలకెన్నా అవయవ దానం చాలా గొప్పది. జీవితాన్ని విలువైనదిగా భావిస్తారు. కానీ, చాలా సార్లు, సరైన అవయవం లభించక మరణాలు సంభవిస్తాయి. మట్టిలోకి వెళ్లే శరీర భాగాలను మరొకరికి దానం చేయడం చాలా ఉత్తమం. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరణానికి ముందు అవయవదాతల అంత్యక్రియలు ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.
గత నెల, తమిళనాడు ఉత్తమ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థగా అవార్డును కైవసం చేసుకుంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును అందజేసింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన ప్రకటన చేసింది.
ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విడుదల చేసిన ప్రకటనలో, అవయవదానం ద్వారా వందలాది మంది రోగులకు ప్రాణదానం చేసే ప్రయత్నంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. బ్రెయిన్ డెడ్‌కు గురైన కుటుంబసభ్యుల విషాదకర పరిస్థితుల్లో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చే కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.
Also Read: Hero Nani: నేను స్కూలింగ్ లో ఉండగానే ప్రేమలో పడ్డాను: హీరో నాని