HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Cm Stalin Compares Bjp Government To Sultans

CM Stalin: భాజపా ప్రభుత్వాన్ని సుల్తాన్లతో పోల్చిన సీఎం స్టాలిన్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రాలపై అవలంబిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 'ఢిల్లీ పాలకులు సుల్తాన్లు కారు, రాష్ట్రా పాలకులు బానిసలు కారని' అని ఆయన చెప్పారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2025 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Stalin Sensational Comments On Pm Modi
Cm Stalin Sensational Comments On Pm Modi

CM Stalin: రాష్ట్రాలపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వ వైఖరిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. “దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నవారు సుల్తాన్లు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు బానిసలు కావు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, శాసనసభలో ఆమోదించి గవర్నర్‌ వద్దకు పంపిన బిల్లులను వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విలువలను పరిరక్షించిందన్నారు.

గవర్నర్‌ లేదా ప్రధానితో వ్యక్తిగతంగా తమకు విరోధమేమీ లేదని, వారి పదవులకు తగిన గౌరవాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే రాజ్‌భవన్‌లు, విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేసే కేంద్రాలుగా మారాయని, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆదేశాల్ని అమలు చేసే చట్టవిరుద్ధ ప్రతినిధుల్లా గవర్నర్లు పనిచేస్తున్నారని ఆరోపించారు.

స్వయంప్రతిపత్తి వ్యవస్థను, సమాఖ్య పాలనను దాదాపు 50 ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిస్తోందని తెలిపారు. కేంద్రంలోని ప్రస్తుత భాజపా ప్రభుత్వం తమని తాము సుల్తాన్‌గా భావించి రాష్ట్రాల హక్కులను గుంజుకోవాలని చూస్తోందని, విద్య, న్యాయం, పన్నులు, పరిపాలన తదితర రంగాలలో రాష్ట్రాల అధికారాలను దకించుకోవాలని చూస్తుందని విమర్శించారు.

తమిళనాడులో ఇనుప పరికరాల తయారీకి సంబంధించిన సాంకేతికత 5,300 సంవత్సరాల క్రితమే ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువు చేసామని చెప్పారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం అయినా, ప్రధాని మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై శుభాకాంక్షలు చెప్పకపోవడం చూస్తే, తమిళులను భారతదేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

2026 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మరియు దాని మిత్ర పక్షాలు విజయం సాధించేందుకు తగిన బలంతో ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, జలవివాదాల్లో రాష్ట్రానికి సముచిత వాటా దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

“గవర్నర్‌ పదవి అవసరమేనా?”

ఇంకొక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, గవర్నర్‌ పదవి అవసరం లేదన్న అభిప్రాయాన్ని తమ పార్టీ కలిగి ఉందని తెలిపారు. అయినప్పటికీ ఆ పదవిలో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడం అవసరమని అన్నారు. ప్రతి ఎన్నికలోనూ రాష్ట్ర స్వయంప్రతిపత్తి విధానంతోనే ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్వయంప్రతిపత్తి కమిటీపై కొందరు వక్రీకరణలు చేస్తున్నారని, ఇది ఎలక్షన్ల కోసమే అన్నదానిని తిప్పికొట్టారు. అన్నాడీఎంకే–భాజపా కూటమి గతంలో విఫలమైందని, ప్రజలు మరోసారి వారిని తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రవేశించేందుకు భాజపా నాయకులు చేస్తున్న అర్థరహిత వ్యాఖ్యలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భాజపా చేసిన ప్రజాస్వామ్య విఘాత చర్యలకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK-BJP Alliance
  • CM Stalin
  • CM Stalin Sensational Comments On PM Modi
  • DMK Party
  • narendra modi
  • pm modi

Related News

Kedarnath Temple opens for devotees

Kedarnath : నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. తెరుచుకున్న ఆలయ ద్వారాలు..

ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు నేడు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్‌నాథ్ ఆలయం నేడు ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సుమారు 51 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు స్వాగతం పలికింది. స్వామి

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • PM Modi

    12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

  • Lok Sabha Seats

    లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd