HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Child Pornography Case In Kerala

Child Pornography Case : చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన కేర‌ళ పోలీసులు

చైల్డ్ పోర్నోగ్రఫీపై అణిచివేతలో భాగంగా కేర‌ళ పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. పిల్లలకు సంబంధించిన అభ్యంతరకరమైన

  • Author : Prasad Date : 27-02-2023 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
child pornography case
child pornography case

చైల్డ్ పోర్నోగ్రఫీపై అణిచివేతలో భాగంగా కేర‌ళ పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. పిల్లలకు సంబంధించిన అభ్యంతరకరమైన విషయాలను వీక్షించినందుకు, షేర్ చేసినందుకు కేర‌ళ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి వ‌ద్ద నుంచి 270 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12 మందిని అరెస్ట్ చేసి 142 కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో వృత్తిపరమైన ఉద్యోగాలు చేస్తున్న యువకులు, సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

పి-హంట్ 23.1 పేరుతో కేరళ పోలీసు సిసిఎస్‌ఇ (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్‌ను ఎదుర్కోవడం) బృందం పదో స్పెషల్ డ్రైవ్ కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 858 లొకేషన్‌లను గుర్తించింది. జిల్లా ఎస్పీల కార్యాచరణ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 26 ఫిబ్రవరి 2023 ఆదివారం తెల్లవారుజాము నుండి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు విజ‌య‌వంత‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా బృందాలు 270 పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. 142 కేసులు నమోదయ్యాయి. వీటిలో మొబైల్ ఫోన్లు, మోడెమ్‌లు, హార్డ్ డిస్క్‌లు, మెమరీ కార్డ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వారిలో కొందరు తమ డివైజ్‌లలో ఈ మేరకు అనేక చాటింగ్‌లు ఉన్నందున పిల్లల అక్రమ రవాణాలో కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ చిత్రాలు, వీడియోలను ప్రచారంలో ఉంచిన మిగతా వ్యక్తుల వివరాలను మరింత సేకరిస్తున్నారు. చట్టం ప్రకారం, ఏదైనా పిల్లల అశ్లీల కంటెంట్‌ను వీక్షించడం, పంపిణీ చేయడం లేదా నిల్వ చేయడం చట్టరీత్యా నేర‌మ‌ని.. ఈ కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ccs
  • child pornography case
  • crime
  • kerala

Related News

PM Modi Praises Samson

సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!

2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

    Latest News

    • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

    • World Health Day : ఆరోగ్యమే మహాభాగ్యం- సంపాదన కంటే శరీరమే ముఖ్యం!

    • Husband kills wife in Sangareddy : ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త

    • Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం

    • NTR Vaidya Seva Strike : హమ్మయ్య..ఏపీలో ఆస్పత్రుల సమ్మె విరమణ

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd