Delhi Politics: విపక్షాల ఐక్యత: కేజ్రీవాల్‌తో నితీష్ రాజకీయాలు
దేశంలో మోడీని ప్రధాని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఒక్కొక్కరుగా మోడీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాల అనంతరం విపక్ష పార్టీల్లో జోష్ కనిపిస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 21-05-2023 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Politics: దేశంలో మోడీని ప్రధాని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఒక్కొక్కరుగా మోడీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాల అనంతరం విపక్ష పార్టీల్లో జోష్ కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మోడీని ఎలాగైనా ఇంటికి పంపించేయాల్సిందిగా తీర్మానించుకున్నారు. అందులో భాగంగా అత్యవసర భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు విపక్షాల ఐక్యతకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం రాజధాని ఢిల్లీకి వచ్చి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇరువురు నేతల భేటీ విపక్షాల ఐక్యతను చాటిచెబుతుందని భావిస్తున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ కోణంపై సమావేశంలో చర్చించనున్నారు.
#WATCH | Bihar CM & JD(U) leader Nitish Kumar arrives at the Civil Lines residence of Delhi CM Arvind Kejriwal pic.twitter.com/BUekK4HSlg
— ANI (@ANI) May 21, 2023
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్నారు. విపక్షాల ఐక్యతపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర సీనియర్ నేతలతో నితీశ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నట్టు చర్చ జరుగుతోంది. కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నితీష్ కుమార్‌ను అభినందించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా నితీష్ కుమార్‌తో చర్చలు జరిపారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ కుమార్ రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి రాజా కూడా హాజరయ్యారు. వీరిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఉన్నారు.
Read More: Rs 10000 Note : రూ.10,000 నోటు ఉండేది తెలుసా ?