Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
- By Hashtag U Published Date - 10:57 PM, Fri - 14 January 22

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా సౌత్ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజే 28,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక్క బెంగుళూరులొనే ఒక్కరోజులో 20,122 కేసులు నమోదయ్యాయని కర్ణాటక ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. కర్ణాటకలో ఒక్కోరోజు 12.98 కరోనా పాజిటివ్ రేటు ఉందని, కానీ కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని మంత్రి తెలిపారు. కేసుల కట్టడికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుందని ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి సుధాకర్ తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇదివరకే కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమల్లో ఉంది. ఇకపెరుగుతున్న కేసులదృష్ట్యా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని కేసుల కట్టడి కోసం మరిన్ని చర్యలు చేపడుతామని అధికారులు తెలిపారు. ప్రజలెవరు అనవసరంగా బయటకి రావొద్దని, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Highest testing since the beginning of pandemic with 2.21 lakh tests today.
◾New cases in State:28,723
◾New cases in B'lore: 20,121
◾Positivity rate in State: 12.98%
◾Discharges: 3,105
◾Active cases State: 1,41,337 (B'lore- 101k)
◾Deaths:14 (B'lore- 07)
◾Tests: 2,21,205— Dr Sudhakar K (@DrSudhakar_) January 14, 2022