Jayalalitha Jewellery : 6 పెట్టెల్లో జయలలిత ఆభరణాలు.. అవన్నీ ఎవరికో తెలుసా ?
Jayalalitha Jewellery : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వజ్రాభరణాల పెట్టెలు ఎవరివి ?
- Author : Pasha
Date : 20-02-2024 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
Jayalalitha Jewellery : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వజ్రాభరణాల పెట్టెలు ఎవరివి ? అవి ఎవరికి దక్కుతాయి ? అనే దానికి సంబంధించి బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ బంగారు ఆభరణాలను తమిళనాడు రాష్ట్ర సర్కారుకు అప్పగించేందుకు కోర్టు ఒక డేట్‌ను ఫిక్స్ చేసింది. ఆ ఆభరణాలను తీసుకోవడానికి మార్చి 6,7 తేదీల్లో 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. మార్చి 6,7 తేదీలలో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
జయలలితకు చెందిన బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించామని జడ్జి వెల్లడించారు. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకొని ఆభరణాలను(Jayalalitha Jewellery) తీసుకెళ్లాలని సూచించారు. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలని నిర్దేశించారు. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్ల డీడీని కర్ణాటక సర్కారుకు ఇదివరకే అందించింది. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ కాలేదు.
జయలలితపై ఏమిటా కేసు ?
అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014 సంవత్సరంలో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.
Also Read : Imran Khan : పాక్‌లో ఇమ్రాన్ సర్కారు.. అనుచరుల స్కెచ్ !?
ఈ ఆభరణాలు ఎక్కడివి ?
- అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి.
- కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వాటిలో.. 7,040 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి . 700 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. రూ.1.93 లక్షల నగదు ఉంది.
- కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వాటిలో.. 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు ఉన్నాయి.