Mechanic Rocky Review & Rating : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 07:15 PM, Fri - 22 November 24

Mechanic Rockey Review & Rating మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మెకానిక్ రాకీ. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రజిని తాళ్లూరి ఈ సినిమా నిర్మించారు. మీనాక్షి, శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ :
చదువు సరిగా అబ్బక మెకానిక్ అవుతాడు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్). తండ్రి నడిపిస్తున్న గ్యారేజ్ ను చూసుకుంటూ లైఫ్ సాగిస్తుంటాడు. ఐతే ఆ గ్యారేజ్ స్థలం మీద రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. మనుషులతో చెప్పించి ఖాళీ చేయించాలని చూసినా కుదరదు. ఐతే ఎలాగైనా ఆ ప్లేస్ ని దక్కించుకోవాలని ప్రయత్నించిన రంకిరెడ్డికి రాకీ అడ్డు తగులుతాడు. ఈ క్రమంలో తన కాలేజ్ లవ్ ప్రియ (మీనాక్షి) అతని లైఫ్ లోకి వస్తుంది. ఆమెతో పాటే తన దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు శ్రద్ధ కూడా పరిచయం అవుతుంది. ఇంతకీ రాకీ ఎవరిని ప్రేమించాడు..? రంకిరెడ్డి తో గొడవ ఏమైంది..? ఇలాంటి విషయాలు తెలియాలంటే మెకానిక్ రాకీ చూడాలి.
విశ్లేషణ :
ఈమధ్య సినిమాలు రొటీన్ ప్యాట్రన్ లో నడిపిస్తూనే చివర్లో ట్విస్ట్ ఇస్తూ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఆ కోవలోనే మెకానిక్ రాకీ వస్తుంది. హీరో గ్యారేజ్ నడపడం అతని కాలేజ్ ఫ్రెండ్ పరిచయమవడం ఆమెలో ప్రేమను కొనసాగించడం ఇదంతా రొటీనే ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే ఆల్రెడీ చూసేసిన సీన్స్ తోనే నింపేశారు. డైరెక్టర్ కూడా పక్కా పాత టెంప్లేట్ తోనే నడిపించాడు.
ఐతే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు కాస్త రిఫ్రెషింగ్ అనిపిస్తాయి. అప్పటికే ఇదేం రొటీన్ సినిమా అని అనుకున్న వారికి ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఐతే మళ్లీ క్లైమాక్స్ విషయంలో దర్శకుడు పట్టు కోల్పోతాడు. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త బాగా రాసుకుని క్లైమాక్స్ మీద ఇంకా గురి పెట్టి ఉంటే మెకానిక్ రాకీ మంచి వర్తబుల్ సినిమా అయ్యుండేది.
ఇప్పటివరకైతే సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. విశ్వక్ సేన్ ఎనర్జీ సినిమాను కాపాడేస్తుందేమో చూడాలి. ఐతే సినిమా ఫస్ట్ హాఫ్ నిరాశ పరచడంతో సెకండ్ హాఫ్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఐతే మళ్లీ క్లైమాక్స్ కి గ్రాఫ్ పడిపోతుంది.
సినిమాలో కొన్ని సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. ఓవరాల్ గా సినిమా రొటీన్ సీన్స్ తో కొన్ని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఐతే ప్రేక్షకుడి మూడ్ ని బట్టి సినిమాను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
నటన & సాంకేతిక వర్గం :
విశ్వక్ సేన్ ఎప్పటిలానే తన ఎనర్జీతో అదరగొట్టేశాడు. రాకీ పాత్రలో తన జోష్ బాగుంది. మీనాక్షి, శ్రద్ధ శ్రీనథ్ ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సునీల్, నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. మిగతా పాత్రదారులంతా కూడా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కొన్ని చోట్ల వర్క్ అవుట్ అయ్యింది. మనోజ్ రెడ్డి కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంత సమకూర్చినట్టు ఉంది. డైరెక్టర్ రవితేజ సెకండ్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధ ఫస్ట్ హాఫ్ మీద పెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
విశ్వక్ సేన్ ఎనర్జీ
మ్యూజిక్
సెకండ్ హాఫ్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
రొటీన్ టెంప్లేట్
బాటం లైన్ : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. రిపేర్లు సగం మాత్రమే చేశాడు..!
రేటింగ్ : 2.5/5