HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Movie Reviews News
  • ⁄Ravi Teja Comes Out With A Dhamaka

Dhamaka Review: రవితేజ ‘ధమాకా’ ఎలా ఉందంటే!

  • By Balu J Updated On - 01:10 PM, Fri - 23 December 22
Dhamaka Review: రవితేజ ‘ధమాకా’ ఎలా ఉందంటే!

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన (Dhamaka) ‘ధమాకా’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ అండ్ మాస్ అంశాలున్న ట్రైలర్, అంతకుమించి మాస్ బీట్ సాంగ్స్ ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడేలా చేశాయి. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ (Review) చదవాల్సిందే!

స్టోరీ ఇదే
సచిన్ ఖేడేకర్ అనే వ్యాపార దిగ్గజం తన వ్యాపార సామ్రాజ్యానికి కొత్త CEOని ప్రకటించడంతోనే ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్వామి – ఒక మధ్యతరగతి వ్యక్తి (Raviteja), మరొక నాగరీకమైన రవితేజ డ్యూయల్ ట్రాక్ వెనుక ఎన్నో ట్విస్టులు, ప్రేమలుంటాయి. సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ గా నటించాడు. రెండు పాత్రల్లోనూ షార్ప్‌గా కనిపిస్తూ చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు. కాకపోతే రొటీన్ సినిమానే భుజానికెత్తుకున్నాడు. శ్రీ లీల తన పాత్రకు న్యాయం చేస్తూ చక్కగా నటించింది. మాస్ సాంగ్స్‌లో రవితేజతో సమానంగా స్టెప్పులు వేసి మెస్మరైజ్ చేసింది. సచిన్ ఖేడేకర్, రావు రమేష్, జయరామ్, ఇతర ప్రముఖ నటీనటులు తమ తమ పాత్రల్లో నటించారు. ఇక ఈ ధమాకా (Dhamaka) మూవీలో మంచి స్టార్ కాస్ట్ ఉంది.

విశ్లేషణ
రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథలో కొత్తదనం ఏమాత్రం లేదు. ఈ సినిమాలో రొటీన్ టచ్ ఉంది. కొన్ని విషయాల్లో స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. సినిమా అక్కడక్కడ ట్రాక్ తప్పిన సమయంలో ఎనర్జిటిక్ రవితేజ (Raviteja) తన నటనతో సినిమాను మోశాడు. కాబట్టి, రొటీన్ టచ్ ఉన్నప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు (Songs) కూడా ఈ మూవీకి అదనపు బలం. ఇప్పటికే ఇందులోని పాటలు జనాల్లోకి వెళ్లాయి. సెకండాఫ్‌లో జింతాక్‌ తో పాటు మరో పాట ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి. ఎడిటింగ్ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫ్రేమ్‌లు రిచ్‌గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూయల్ రోల్ ట్రాక్‌కి సంబంధించినది. క్లైమాక్స్ వీక్ గా ఉంది. కానీ తగినంత వినోదం, కామెడీ సీన్స్ ఉండటంతో ఓకే అనిపించింది. కమర్షియల్ చిత్రాలలో లాజిక్‌లు పక్కనపెట్టి చూడాల్సిందే మరి. ధమాకా రొటీన్ టచ్‌తో కూడిన సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్. కానీ కామెడీ సీన్స్, మాస్ సన్నివేశాలు ఉండటంతో ఓకే అనిపిస్తోంది.

ఫ్లస్ పాయింట్స్ 
రవితేజ మార్క్ నటన
పాటలు బాగున్నాయి.
స్టార్ కాస్ట్

మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
క్లైమాక్స్‌ గొప్పగా లేదు.

రేటింగ్: 2.75/5

Tags  

  • Dhamaka
  • Movie Review
  • Ravi teja
  • sree leela

Related News

Jinthaak Song Teaser: ధమాకాలో దుమ్మురేపిన ‘జింతక్’ సాంగ్ టీజర్ చూశారా!

Jinthaak Song Teaser: ధమాకాలో దుమ్మురేపిన ‘జింతక్’ సాంగ్ టీజర్ చూశారా!

ధమాకా (Dhamaka) మేకర్స్ జింతక్ వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

  • Dhamaka Pulsar Bike Song: ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన రవితేజ- శ్రీలీల

    Dhamaka Pulsar Bike Song: ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన రవితేజ- శ్రీలీల

  • Chiru and Ravi Teja: డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్!

    Chiru and Ravi Teja: డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్!

  • Dhamaka Box Office Collections: రవితేజ జోరు.. ‘ధమాకా’కు అదిరిపొయే కలెక్షన్స్!

    Dhamaka Box Office Collections: రవితేజ జోరు.. ‘ధమాకా’కు అదిరిపొయే కలెక్షన్స్!

  • Raviteja Exclusive: మొదటి నుండి నేనింతే.. మనం మాట్లాడకూడదు, సినిమానే మాట్లాడుతుంది!

    Raviteja Exclusive: మొదటి నుండి నేనింతే.. మనం మాట్లాడకూడదు, సినిమానే మాట్లాడుతుంది!

Latest News

  • Jr NTR and Kalyan Ram: తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

  • Murder : ఢిల్లీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. వివాహేత సంబంధ‌మే కార‌ణ‌మా..?

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: