Game Changer Review : గేమ్ ఛేంజర్ : రివ్యూ
- By Ramesh Published Date - 03:07 PM, Fri - 10 January 25

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచానలతో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. కియరా అద్వాని, అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
విశాఖపట్నానికి కొత్త కలెక్టర్ గా వస్తాడు రామ్ నందన్ (రామ్ చరణ్). అంతకుముందే ఐపీఎస్ గ పనిచేసినా ఐ.ఏ.ఎస్ అవ్వాలని కలగని ఐ.ఏ.ఎస్ అవుతాడు. కాలేజ్ డేస్ లో దీపిక (కియరా అద్వాని)ని ప్రేమిస్తాడు రామ్ ఐతే మధ్యలో విడిపోయి అతను కలెక్టర్ అయ్యాక దీపిక దగ్గరవుతుంది. కలెక్టర్ అయిన రామ్ అక్కడ జరుగుతున్న అక్రమాలను ఆపాలని ట్రై చేస్తాడు ఈ క్రమంలో మంత్రి మోపిదేవి (ఎస్.జె సూర్య) తో తలపడతాడు. ఈ టైం లో మోపిదేవిపై రామ్ చేసుకోవడంతో సస్పెండ్ అవుతాడు. మరోపక్క బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)మృతితో మోపిదేవి సీఎం అయ్యే అవకాశం వస్తుంది. కాని రామ్ వల్ల అది పోతుంది. ఇంతకీ రామ్ కు సత్యమూర్తికి ఉన్న రిలేషన్ ఏంటి..? అప్పన్న కథ ఏంటి..? రామ్ నెక్స్ట్ ఏం చేశాడు అన్నది గేమ్ ఛేంజర్ కథ.
కథనం :
శంకర్ సినిమా అంటే కోట్ల కొద్దీ బడ్జెట్ కంపల్సరీ దిల్ రాజు కూడా శంకర్ తో సినిమా అనుకున్నప్పుడే భారీ బడ్జెట్ ఫిక్స్ అయ్యాడు. గేమ్ ఛేంజర్ కథ కార్తీక్ సుబ్బరాజ్ అందించాడు. ఐతే ఈ కథ రెగ్యులర్ కథే. కొత్తగా ఏమి లేదు. కానీ ఈ కథకు శంకర్ దిల్ రాజు చేత దాదాపు 300 కోట్ల పైన బడ్జెట్ పెట్టించాడు.
ఇక సినిమాలో కొన్ని మెరుపులు ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఇంకా విజువల్స్ సాంగ్స్ కోసం ఖర్చు పెట్టినదంతా తెర మీద కనిపిస్తుంది. ఐతే అసలు కథలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వల్ల ఇవన్నీ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అప్పన్న పాత్ర ఇంప్రెస్ చేస్తుంది. ఐతే ఆ పాత్ర నిడివి తక్కువ ఉండటం తో ప్రేక్షకులు నిరుత్సాహపడతారు.
ఇక సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ముఖ్యంగా రాం నందన్ పాత్ర ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేదని అనిపిస్తుంది. శంకర్ ఈమధ్య వచ్చిన సినిమాల కన్నా బెటరే కానీ తన మార్క్ గ్రిప్పింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ కొరవడినట్టు అనిపిస్తుంది.
కొత్త కథలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనాలు సృష్టిస్తున్న ఈ టైం లో రొటీన్ స్టోరీతో అది కూడా రెగ్యులర్ ఫార్మెట్ స్క్రీన్ ప్లేతో రావడం డిజప్పాయింట్ చేస్తుంది. ఐతే మెగా ఫ్యాన్స్ అంతా ఫీస్ట్ గా భావించినా కామన్ ఆడియన్స్ కు గేం ఛేంజర్ కాస్త భారంగానే అనిపిస్తుంది.
నటన & సాకేతిక వర్గం :
రామ్ చరణ్ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. అప్పన్న పాత్రలో చిట్టిబాబు పాత్రని గుర్తు చేస్తాడు. సరైన క్యారెక్టర్ రాయాలే కానీ చరణ్ ఏదైనా చేయగలడని ప్రూవ్ చేశాడు. కియరా అద్వాని కేవలం గ్లామర్ కోసమే ఉంది. అంజలి ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ఎస్.జె సూర్య విలనిజం ఆకట్టుకుంది. శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే.. తిరు సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక శంకర్ డైరెక్షన్ భారీ తనం కనిపించింది. ఐతే కథ కథనాలే ఇంకాస్త బాగుంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్
విజువల్స్
థమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
లవ్ ట్రాక్
కామెడీ
బాటం లైన్ :
గేమ్ ఛేంజర్.. ఆట బాగుంది కానీ సంతృప్తి పొందేలా లేదు..!
రేటింగ్ : 2.5/5