Saripoda Shanivaram Review & Rating : నాని సరిపోదా శనివారం రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 02:20 PM, Thu - 29 August 24
Saripoda Shanivaram Review & Rating న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
చిన్నప్పుడే తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం ఒక్క శనివారం మాత్రమే సూర్య (నాని) ఎవరి మీద అయినా తన కోపాన్ని చూపిస్తాడు. మిగతా రోజుల్లో కోపం వచ్చినా వాళ్ల పేర్లు బుక్ లో రాసుకుంటాడు తప్ప ఏమి చేయడు. శనివారం అప్పటిదాకా వారిపై కోపం ఉంటే కొడతాడు లేదంటే లేదు. ఇలా తనకున్న టిపికల్ మెంటాలిటీతో జీవితం సాగిస్తున్న సూర్యకు కానిస్టెబుల్ చారులత (ప్రియాంక మోహన్) పరిచయమవుతుంది. ఆమెకు దగ్గరయ్యే క్రమంలో సోకుల పాలెం ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎస్.ఐ దయా గురించి తెలుస్తుంది. ఇక ఆ ఊరి ప్రజల సమస్య తన సమస్యగా మార్చుకున్న సూర్య దయ పేరుని పుస్తకంలో చేర్చుతాడు. ఈ క్రమంలో దయా ఆటలు కట్టించడానికి అతని బ్రదర్ కూర్మానంద్ (మురళి శర్మ)ని వాడుకుంటాడు. ఇంతకీ సూర్య వర్సెస్ దయ గొడవ ఎక్కడ మొదలైంది..? దయ కు కూర్మానంద్ కు ఉన్న గొడవ ఏంటి..? చివరకు దయని సూర్య ఏం చేశాడు అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో వివేక్ ఆత్రేయ ఒకరు. అంతకుముందు తీసిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ ఇవన్నీ కూడా క్లాస్ ఆడియూన్స్ కి సూపర్ గా నచ్చేశాయి. ఐతే వివేక్ ఈసారి నానితో మాస్ అటెంప్ట్ గా సరిపోదా శనివారం చేశాడు. కథలో మెయిన్ పాయింట్ హీరో శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడన్న పాయింట్ కి తగిన కథ అంతా బిల్డప్ చేసుకున్నాడు. కథ పాతదే.. కానీ ఈ ఒక్క పాయింట్ కొత్తది.
ఇక కథనం కూడా మాస్ సినిమాకు అచ్చొచ్చిన ఫార్మెట్ లోనే తీసుకెళ్లాడు. హీరో ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్ని పర్ఫెక్ట్ ఒక మాస్ మసాలా సినిమా అప్పీల్ ను సాటిస్ఫై చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ బిల్డప్ కి తీసుకున్న డైరెక్టర్ ఇంటర్వెల్ లో హీరో విలన్ ఫేస్ ఆఫ్ తో ట్విస్ట్ ఇస్తాడు. ఇక సెకండ్ హాఫ్ మీద చాలా హోప్స్ ఉండగా కొన్ని చోట్ల మెరిపులు మెరిపిస్తూ మరికొన్ని చోట్ల కాస్త స్లో అవుతూ ఫైనల్ గా సినిమా ఆడియన్స్ ని సంతృప్తి పరచేలా చేస్తాడు.
సినిమా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త లెంగ్త్ ఎక్కువ అనిపిస్తుంది. ఐతే ఓవరాల్ గా చూస్తే సినిమా ఒక 10 నిమిషాలు ట్రిం చేస్తే ఇంకాస్త బాగుండేదని అనిపిస్తుంది. సినిమా ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. వివేక్ ఆత్రేయ నుంచి ఇంత వైలెన్స్ సినిమా ఎవరు ఊహించలేదు.
నాని తన బలాలు మరోసారి చూపించాడు. సూర్య విలనిజం అదిరిపోయింది. సో వీకెండ్ టైం పాస్ కోసం సరిపోదా శనివారం పక్కా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.
నటీనటులు :
సినిమాలో సూర్య పాత్రలో నాని మరోసారి అదరగొట్టాడు. చారులత పాత్రలో ప్రియాంక ఇంప్రెస్ చేసింది. సరిపోదా శనివారం లో మెయిన్ గా చెప్పుకునే రోల్ దయానంద్ అలియాస్ దయా.. ఎస్ జే సూర్య ఈ పాత్రలో అదరగొట్టేశారు. తప్పకుండా ఈ సినిమాకు ఆయనకు బెస్ట్ సపోర్ట్ రోల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మురళి శర్మ తన పాత్ర పరిధి మేరకు మెప్పించారు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
ఈ సినిమా వరకు తెర వెనక జేక్స్ బిజోయ్ చేసిన కృషి సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. బిజిఎం అయితే ఒక రేంజ్ లో ఇచ్చిపడేశాడు. నాని ప్రమోషన్స్ లో ఎందుకు అంత స్పెషల్ గా చెప్పాడు అన్నది సినిమా చూస్తే అర్ధామవుతుంది. కెమెరా మెన్ పనితనం బాగుంది. డైరెక్టర్ గా వివేక్ సక్సెస్ అయ్యాడు. ఐతే రైటింగ్ పరంగా కొన్ని చోట్ల రొటీన్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నాని, ఎస్ జే సూర్య
బిజిఎం
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ ప్రిడిక్టబుల్ గా అనిపించడం
లెంగ్త్
బాటం లైన్ :
సరిపోదా శనివారం.. నాని మాస్ శివతాండవం..!
రేటింగ్ : 3/5
Related News
Saripoda Shanivaram 3 Days Collections : 3 రోజులు 50 కోట్లు.. నాని సరిపోదా కలెక్షన్స్..!
నాని మాస్ సంభవం ఏంటన్నది ఈ వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. మొదటి నుంచి నాని ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని బల్లగుద్ది