Mr Bachchan Review & Rating : మిస్టర్ బచ్చన్ రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 07:57 AM, Thu - 15 August 24
Mr Bachchan Review & Rating మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ ఈ కాంబోలో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆల్బం తోనే సినిమాపై భారీ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
షోలే సినిమాను వందసార్లు చూసి కొడుక్కి ఆనంద్ అనే పేరు మార్చి బచ్చన్ (రవితేజ)ని పెడతాడు తండ్రి తనికెళ్ల భరణి. ఇక పేరు పెట్టినప్పటి నుంచి హిందీ పాటలు, సినిమాలు చూస్తూ పెరుగుతాడు బచ్చన్. కోటిపల్లి ఊళ్లో ఆర్కెస్ట్రా నడుపుతున్న అతను పెద్దయ్యాక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అవుతాడు. తన నిజాయితీ వల్ల జాబ్ నుంచి సస్పెండ్ అవుతాడు బచ్చన్. అదే టైం లో తన ఊళ్లోనే జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో లవ్ ట్రాక్ నడిపించి ఆమెతో పెళ్లి చేసుకునే టైం కు ఎంపీ ముత్యం జగ్గయ్య మీద ఐటీ రైడ్ చేయాలని ఆఫీసర్స్ బచ్చన్ కి వర్క్ అసైన్ చేస్తారు. ఇదివరకు ముత్యం జగ్గయ్య మీద ఐటీ రైడ్స్ జరిపిన వాళ్లంతా కనిపించకుండా పోయారు. మరి జగ్గయ్య ఇంటి మీద బచ్చన్ ఐటీ రైడ్స్ ఎలా జరిపాడు.. ఈ ప్రాసెస్ లో అతనికి వచ్చిన సమస్యలు ఏంటి..? జిక్కీతో బచ్చన్ కథ ఎక్కడిదాకా వెళ్లింది అన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
రవితేజ(Raviteja) , హరీష్ శంకర్ కాంబో అనగానే కచ్చితంగా ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్ అంచనా వేస్తారు. మిస్టర్ బచ్చన్ కూడా అదే తరహాలో వచ్చింది. ఐతే ఇది ఒరిజినల్ కథతో వస్తే పెద్దగా పోలికలు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కానీ బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా రావడం వల్ల ఆ సినిమాను పోల్చాల్సి వస్తుంది. రైడ్ సినిమా అంతా సీరియస్ నోట్ లా నడిస్తే ఆ మూల కథను తీసుకుని హరీష్ శంకర్ రెగ్యులర్ మాస్ టెంప్లేట్ లో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించాడు.
సినిమాలో రవితేజ ఎనర్జీ, భాగ్య శ్రీ గ్లామర్ ఎంత సపోర్ట్ చేసినా అవసరమైన కథ, కథనం ట్రాక్ తప్పడంతో ప్రేక్షకులు నిరుత్సాహ పడతారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హరీష్ శంకర్ మార్క్ కామెడీ, హీరో ఎలివేషన్, మాస్ అంశాలు, సాంగ్స్ అన్ని పెట్టేశాడు కానీ సెకండ్ హాఫ్ లో సీరియస్ గా కథనం నడిపించే సరికి ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు.
రీమేక్ లు తీయడం చాలా కష్టం. ఒరిజినల్స్ కన్నా రీమేక్ లే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందని చెప్పిన హరీష్ శంకర్. రీమేక్ ని రీమేక్ లా తీస్తే చాలన్నట్టుగా మిస్టర్ బచ్చన్ చూస్తే అర్ధమవుతుంది. రవితేజ ఎనర్జీకి రైడ్ లాంటి కథ ఏంటని ముందు నుంచి డౌట్ కొడుతున్నా పూర్తిగా హరీష్ శంకర్ దాన్ని ఒక కమర్షియల్ యాంగిల్ గా మార్చి తీశాడు.
ఇక స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ క్యామియో మెప్పిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సర్ ప్రైజ్ ఎంట్రీ హుషారెత్తిస్తుంది. ఐతే సినిమాకు ఇన్ని ఉన్నా కూడా అద్భుతం అనిపించే అంశాలు కనిపించవు. గురూజీ అనే పాత్ర పెట్టి ఎవరి మీదనో ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడు హరీష్ శంకర్. మరి ఆయనతో ఈయనకి ఉన్న గొడవలు ఏంటో తెలియదు కానీ గురూజీ పై వెటకారం బాగా చేశాడు.
రైడ్ సినిమా చూసి తన సినిమా చూడండి అని ఛాలెంజ్ చేసిన హరీష్ శంకర్ ఆ కథను మాత్రమే తీసుకుని తన మార్క్ మాస్ కోటింగ్ వేశాడని గుర్తించలేకపోయారు. కానీ ఈ కోటింగ్ సినిమాకు ప్లస్ అవుతుందని ఆయన అనుకున్నారు కానీ ఆడియన్స్ కి మాత్రం ఎక్కలేదు.
నటన, సాంకేతిక వర్గం :
మిస్టర్ బచ్చన్ లో మాస్ మహరాజ్ రవితేజ ఎనర్జీ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. సినిమాకు తను ఇవ్వాల్సినంత ఇచ్చేశాడు. ముఖ్యంగా వింటేజ్ రవితేజాని గుర్తు చేశాడు హరీష్ శంకర్. కొత్త అమ్మాయి భాగ్య శ్రీ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ఐతే ఓన్ డబ్బింగ్ వల్ల కొన్ని డైలాగ్స్ రోల్ అయ్యాయి. ఇక విలన్ గా జగపతి ఎప్పటిలానే ఇంప్రెస్ చేశాడు. కానీ ఆయన్ను కూడా సరిగా వాడుకోలేదనిపిస్తుంది. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ అలరిస్తుంది. మిగతా వారంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. అతని మాస్ బీట్స్ ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తున్నాయి. కెమెరా మెన్ అయనంకా బోస్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి కానీ హరీష్ శంకర్ ట్రీట్ మెంట్ మాస్ ఆడియన్స్ కు తప్ప మిగతా వారికి ఎక్కదు. రైడ్ రీమేక్ గా హరీష్ శంకర్ పూర్తిగా మార్చేశాడని అనుకున్నా అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉంటే బాగుండేది కానీ రెగ్యులర్ మాస్ స్టఫ్ లా ఉండటంతో ప్రేక్షకులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ నుంచి ఆశించిన స్థాయి వర్క్ రాలేదని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాకు కావాల్సిన దానికన్నా మించి బడ్జెట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ వింటేజ్ ఎనర్జీ
భాగ్య శ్రీ గ్లామర్
మిక్కీ జే మేయర్ మ్యూజిక్
అక్కడక్కడ కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
మిస్ యూసింగ్ మాస్ స్టఫ్
చివరగా :
మిస్టర్ బచ్చన్.. మాస్ రాజా ఫ్యాన్స్ కోసమే..!
రేటింగ్ : 2/5
Related News
Harish Shankar : ‘బచ్చన్ ‘ ప్లాప్ తో హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చాడా..?
ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నుంచే నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు టాక్