Raayan Review : ధనుష్ ‘రాయన్’ మూవీ రివ్యూ.. సింహం తోడేలు కథ వర్కౌట్ అయ్యిందా..?
- By News Desk Published Date - 06:47 PM, Fri - 26 July 24

Dhanush Raayan Review : తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఈ వీకెండ్ ‘రాయన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రూపొందింది. ఇక ఈ మైలురాయి చిత్రానికి ధనుషే కథని, స్క్రీన్ ప్లేని అందిస్తూ దర్శకత్వం వహించారు. ధనుష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. కార్తవ రాయన్(ధనుష్)కి ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్) అనే ఇద్దరు తమ్ముళ్లు, దుర్గ(దుషారా విజయన్) అనే ఒక చెల్లి ఉంటుంది. చిన్నప్పుడే వీరి నలుగురు తల్లిదండ్రులకు దూరమవుతారు. ఇక అప్పటినుంచి చెల్లి, తమ్ముళ్ల భాద్యతని కార్తవ రాయనే తీసుకుంటాడు. ఎంతలా అంటే.. తన చెల్లి, తమ్ముళ్ల జోలికి ఎవరైనా వస్తే చంపేసెంతగా కార్తవ ఉంటాడు.
ఇక మరో పక్క రౌడీలు అయిన సీతారాం(SJ సూర్య), దొరై(శరవణన్) రెండు గ్యాంగ్‌లుగా కొట్టుకుంటూ ఉంటారు. వీరిని అంతం చేయడానికి పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్) పగతో చూస్తుంటాడు. అయితే అనుకోకుండా ఒక రోజు దొరై చనిపోతాడు. ఆ తరువాత నుంచి సీతారాం.. రాయన్ ని చంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఈ రౌడీల కథలోకి రాయన్ ఎలా వచ్చాడు..? సీతారాం, రాయన్ ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు..? రాయన్ చెల్లి, తమ్ముళ్ల కథలు ఏంటి..? పోలీసాఫీసర్ ఏం చేసాడు..? అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. అన్న సెంటిమెంట్ కథలు చాలానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ సినిమా కథ కూడా గత సినిమాల మాదిరిగానే ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతుని ఇస్తుంది. అదిరిపోయే ట్విస్ట్ లతో పాటు వావ్ అనిపించే యాక్షన్ సీన్స్, ఊహించని క్లైమాక్స్ తో సినిమా అదుర్స్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రలు పరిచయాలతో కొంచెం స్లోగా నడుస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ మంచి ఇంటరెస్ట్ ని కలిగించారు.
ఇక సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ లు.. తరువాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. సెకండ్ హాఫ్ అంతా రా అండ్ రస్టిక్ గా నడిపించిన ధనుష్ సరికొత్త క్లైమాక్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. రా అండ్ రస్టిక్ పాత్రలను అవలీలగా పోషించే ధనుష్ రాయన్ పాత్రని చాలా ఈజీగా చేశారనే చెప్పాలి. సైలెంట్ పాత్రలో యాక్షన్ చూపించి విజిల్స్ అందుకున్నారు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది.. మన తెలుగు యాక్టర్ సందీప్ కిషన్. ధనుష్ పాత్రతో సమానంగా ఉండే పాత్రని పోషించి అదుర్స్ అనిపించారు. ఈ సినిమాతో సందీప్ కి తమిళంలో మరిన్ని అవకాశాలు రావడం పక్కా. ధనుష్ చెల్లి పాత్రలో నటించిన దుషారా విజయన్ అదరగొట్టేసింది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి, SJ సూర్య, సెల్వ రాఘవన్, శరవణన్, ప్రకాష్ రాజ్ తమతమ పాత్రలకి న్యాయం చేసారు.
సాంకేతిక విశ్లేషణ.. ముందుగా ధనుష్ రైటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక సాధారణ కథకి తాను రాసుకున్న స్క్రీన్ ప్లే వావ్ అనిపిస్తే.. దర్శకుడిగా దానిని మలిచిన వైనం అదుర్స్ అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విషయం ధనుష్ సూపర్ సక్సెస్ అయ్యేరని చెప్పాలి. ఈ సినిమాకి ధనుష్ ఒక ప్లస్ అయితే.. ఏ ఆర్ రెహమాన్ మరో ప్లస్. ఈ సినిమాకి రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒక మాములు బస్తి లొకేషన్స్ ని చాలా అద్భుతంగా చూపించి ఆడియన్స్ ని ఆ ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు.