Worlds Oldest Person : ప్రపంచంలోనే వృద్ధ మహిళ మరియా ఇక లేరు
వాస్తవానికి ఆమె అమెరికాలో పుట్టారు. మరియా రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు.
- By Pasha Published Date - 12:54 PM, Thu - 22 August 24
Worlds Oldest Person : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మరియా బ్రన్యాస్ ఇక లేరు. ఆమె వయసు 117 ఏళ్లు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న తన నివాసంలో మరియా బ్రన్యాస్ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. వాస్తవానికి ఆమె అమెరికాలో పుట్టారు. మరియా రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. 1918 ఫ్లూ వ్యాధిని, , స్పెయిన్ సివిల్ వార్‌ను, 2020 కరోనా మహమ్మారికి ఆమె సాక్షిగా నిలిచారు. మరియా కుటుంబం తొలుత మెక్సికోలో(Worlds Oldest Person) జీవించేది. అయితే కొంతకాలం తర్వాత వారి కుటుంబం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లింది.
We’re now on WhatsApp. Click to Join
1907 సంవత్సరం మార్చి 4న శాన్ ఫ్రాన్సిస్కోలో మరియా జన్మించారు. అనంతరం వారి కుటుంబం 1915లో స్పెయిన్‌కు వలస వెళ్లింది. అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ఒక నౌకలో ప్రయాణించి వారు స్పెయిన్‌కు చేరుకున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే.. స్పెయిన్‌కు చేరుకునే సరికి మరియా తండ్రి టీబీ వ్యాధితో ప్రాణాలు విడిచారు.ఈక్రమంలో మార్గం మధ్యలో ఆయన డెడ్ బాడీని సముద్రంలోనే పారవేశారు. దీంతో నౌక స్పెయిన్ సరిహద్దు తీరానికి చేరే సరికి మరియా, ఆమె తల్లి మాత్రమే మిగిలారు. వారు స్పెయిన్‌లోని బార్సిలోనాలో స్థిరపడ్డారు.
Also Read :Sheikh Hasina : షేక్ హసీనా, ‘అవామీ లీగ్’ ఎంపీలందరి రెడ్ పాస్‌పోర్ట్‌లు రద్దు.. ఎందుకు ?
1936 నుంచి 1939 మధ్యకాలంలో స్పెయిన్‌లో సివిల్ వార్ జరిగింది. ఈ టైంలోనే ఒక డాక్టర్‌ను మరియా పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. మరియాకు ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరు చనిపోయారు. 11 మంది మనవళ్లు మరియాకు ఉన్నారు. ఇంకా ఎంతోమంది ముని మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. మంచి ఆహారం, సరైన జీవన శైలి వల్లే తమ బామ్మ ఇన్నేళ్ల పాటు జీవించారని మరియా కుటుంబీకులు చెబుతున్నారు.
Also Read :CBI Report: సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. కోల్‌కతా ఘటనపై దర్యాప్తులో కీలక పరిణామం
- గతేడాది ఫ్రాన్స్‌కు చెందిన లూసిల్ రాండన్ 118 ఏళ్ల వయసులో మరణించారు.
- జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా 116 ఏళ్ల వయసులో మరణించారు.
Related News
Spain Record: టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన స్పెయిన్ జట్టు..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో స్పెయిన్‌కు ఇది వరుసగా 14వ విజయం. దీంతో టీ20 మెన్స్ ఇంటర్నేషనల్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది.