Turtle Video: తాబేలు దాహం తీర్చిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!
వన్య ప్రాణులు నీళ్లు దొరక్క చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
- By Balu J Published Date - 05:42 PM, Fri - 12 May 23

భగభగ మండే ఎండలకు (Summer) మనుషులే కాదు.. జంతువులు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకపోతే విలవిలలాడిపోవాల్సిందే. వన్య ప్రాణులు నీళ్లు దొరక్క చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలోని ఓ మహిళకు జంతువులు అంటే ఎంతో ప్రేమ. ఎర్రటి ఎండలకు తాబేలు (Turtle) కంటపడింది. దాన్ని చూసి చలించిపోయింది. తన దగ్గరున్న నీళ్ళ బాటిల్ తో దాహం తీర్చే ప్రయత్నం చేసింది. నోరు తెరిచి నీళ్లను గట గటా తాగేసింది తాబేలు.
అయితే దాహం తీరిందో, లేక నీళ్లు సరిపోలేదనో కానీ ఆ తాబేలు మహిళపై దూకెసింది. దీంతో భయపడిన మహిళ అక్కడ్నించీ పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. @strangestmedia అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ఇప్పటివరకు 4.1 మిలియన్ల మంది తాబేలు వీడియోను చూశారు.
https://twitter.com/StrangestMedia/status/1656109016622288896?cxt=HHwWgMC-0YmY1_stAAAA
Also Read: TTD: టీటీడీ ఆనంద నిలయం వీడియో తీసిన వ్యక్తి గుర్తింపు!