Gaganyan : “గగన్‌యాన్”, “చంద్రయాన్-3” మిషన్ల ముహూర్తం ఖరారైంది!!
"గగన్‌యాన్".. ఎప్పుడు ? "చంద్రయాన్-3".. ఎప్పుడు ? అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా గగన్‌యాన్ ప్రయోగం జరగనుంది.
- By Hashtag U Published Date - 08:00 PM, Fri - 22 July 22
“గగన్‌యాన్”.. ఎప్పుడు ? “చంద్రయాన్-3”.. ఎప్పుడు ? అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా గగన్‌యాన్ ప్రయోగం జరగనుంది. 2023 తొలి త్రైమాసికంకల్లా చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ పార్లమెంట్ లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈవివరాలను భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం వెల్లడించింది.
చంద్రయాన్-1, 2,3 మిషన్లు అంటే.. ?
భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. ఇందులో భాగంగా భారతదేశం నుంచి చంద్రుడిపైకి మొదటి అంతరిక్ష వాహనం పంపారు. చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి. అయితే అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగించిన అంతరిక్ష వాహనం చంద్రయాన్-2. కానీ చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయింది. అయినా ఆ వైఫల్యం నుంచి బయటపడి.. చంద్రయాన్-3 కి ఇస్రో సిద్ధమైంది.
‘గగన్ యాన్’ మిషన్ ఏమిటి ?
‘గగన్ యాన్’ మనుషులను అంతరిక్షానికి పంపడం కోసం భారతదేశం నిర్వహిస్తున్న మిషన్. దీని ద్వారా తక్కువ భూమి కక్ష్యలోకి మానవులను పంపించి, భారతీయ ప్రయోగ వాహనం నుంచి తిరిగి తీసుకువచ్చే సామర్థ్యాన్ని చూపించడం దీని ఉద్దేశం. GSLV MK.3 ద్వారా ఇస్రో 2022 చివరికల్లా ఈ ప్రయోగాన్ని నిర్వహించనుంది. దీని ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతేకాకుండా భారత వైమానిక దళానికి చెందిన నలుగురు అధికారులు కూడా ఈ మిషన్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్తో కలిసి పనిచేస్తున్నారు. అయితే.. ఇస్రో మాత్రం వారి పేర్లను గోప్యంగా ఉంచింది.
Related News
Vikram Lander : జాబిల్లిపై మన ల్యాండర్ ఎలా ఉందో తెలుసా ..?
గత నెల 15న అంతరిక్షంలో తిరుగుతున్న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసినట్లు తెలిపింది