HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >What Is Hot Bedding Australian Woman Renting Her Own Bed For Rs 32000 A Month

Hot Bedding : హాట్ బెడ్డింగ్‌తో కాసుల వర్షం.. యువతి వినూత్న వ్యాపారం

హాట్ బెడ్డింగ్‌ను(Hot Bedding) కేవలం సైడ్ బిజినెస్‌గా నడుపుతోంది. సైడ్ బిజినెస్‌లోనూ భారీగానే సంపాదిస్తోంది. 

  • By Pasha Published Date - 12:33 PM, Mon - 5 May 25
  • daily-hunt
Hot Bedding Australian Woman Renting Bed

Hot Bedding : ఇంటిని అద్దెకు ఇవ్వడం, హోటల్ రూంలను అద్దెకు ఇవ్వడం, డ్రెస్‌లను అద్దెకు ఇవ్వడం, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అద్దెకు ఇవ్వడం గురించి మనకు తెలుసు. కానీ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన 38 ఏళ్ల మోనిక్ జెరెమియా అనే యువతి ఏకంగా తన బెడ్‌ను సగం అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఈ వ్యాపారానికే హాట్ బెడ్డింగ్ అనే పేరును పెట్టింది. తన సగం బెడ్‌ను అద్దెకు ఇచ్చినందుకు తొలినాళ్లలో ప్రతినెలా రూ.50వేల దాకా ఆమె వసూలు చేసేది. తన సగం బెడ్‌ను అద్దెకు తీసుకునే వ్యక్తికి ఒక విషయాన్ని ముందే మోనిక్ చెప్పేస్తుంది. అదేమిటంటే.. ‘‘సగం బెడ్‌ను వాడుకునే క్రమంలో పరస్పర గౌరవంతో మసులుకోవాలి. సగం బెడ్‌ను వినియోగించే క్రమంలో లైంగిక సంబంధానికి తావు అనేది ఉండకూడదు. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి’’ అని మోనిక్ జెరెమియా చెప్పేస్తుంది. అందుకు అంగీకరించే వారికే తన సగం బెడ్‌ను అద్దెకు ఇస్తుంది. వాళ్లకు నచ్చినన్ని రోజులు సగం బెడ్‌పై అద్దెకు ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  మోనిక్ జెరెమియా తొలి క్లయింట్ ఆమె మాజీ లవరే. ఆ తర్వాత క్రమంగా గిరాకీ పెరిగింది. మోనిక్‌తో బెడ్‌ను షేర్ చేసుకునేందుకు చాలామంది క్యూ కట్టారు. దీంతో అద్దెలను గణనీయంగా పెంచింది.

Also Read :Ganja Racket : ఆంధ్రా – ఒడిశా బార్డర్‌ నుంచి తెలంగాణకు గంజాయి.. గుట్టుగా సప్లై

ఆమెతో బెడ్ షేరింగ్‌.. ఎగబడుతున్న జనం

మోనిక్ జెరెమియా హాట్ బెడ్డింగ్ వ్యాపారం ఒక్కటే చేయడం లేదు. దీంతో పాటు ఆమె ‘డైవర్సిటీ మోడల్స్’ పేరుతో ఒక మోడలింగ్ ఏజెన్సీని నడుపుతోంది. ఎంతోమంది మోడల్స్ ఆమె వద్ద పనిచేస్తున్నారు. హాట్ బెడ్డింగ్‌ను(Hot Bedding) కేవలం సైడ్ బిజినెస్‌గా నడుపుతోంది. సైడ్ బిజినెస్‌లోనూ భారీగానే సంపాదిస్తోంది.  2017లో ‘మిస్ పవర్ వుమన్ ఆస్ట్రేలియా’ అవార్డును మోనిక్ గెల్చుకుంది. ఆస్ట్రేలియాలో రియాలిటీ టీవీ స్టార్‌గానూ ఆమెకు మంచి పేరుంది. అందుకే మోనిక్‌తో సగం బెడ్ షేర్ చేసుకునేందుకు అంతమంది ఎగబడుతున్నారు.

Also Read :Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?

కరోనా టైంలో ఉద్యోగం కోల్పోయి.. 

2020లో కరోనా సంక్షోభం మోనిక్ జెరెమియా జీవితాన్ని ఆర్థికంగా కుదిపేసింది. ఉద్యోగాన్ని కోల్పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి వచ్చింది.  ఆ కష్టకాలంలో క్రియేటివ్‌గా ఆలోచించి హాడ్ బెడ్డింగ్ వ్యాపారాన్ని మోనిక్ మొదలుపెట్టింది. దానిలో సంపాదించిన డబ్బులతోనే ‘డైవర్సిటీ మోడల్స్’ పేరుతో మోడలింగ్ ఏజెన్సీని ప్రారంభించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Australian Woman
  • Australian Woman Renting Bed
  • Hot Bedding
  • Monique Jeremiah

Related News

    Latest News

    • TikTok: టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ట్రంప్ ఎందుకు ర‌ద్దు చేశారు?

    • Statue of Lord Rama : ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం!

    • Bathukamma Kunta : నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం

    • OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్

    • ‎Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    Trending News

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

      • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd