Typhoon Hinnamnor : దూసుకొస్తోన్న `హిన్నమార్ `ప్రళయం
అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ దూసుకొస్తోంది. దాన్ని టైఫూన్ హిన్నమ్నార్ గా పిలుస్తున్నారు. 2022లో ఇప్పటివరకు భూమిపై నమోదైన అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫానుగా అభివృద్ధి చెందింది.
- By Hashtag U Published Date - 06:00 PM, Fri - 2 September 22

అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ దూసుకొస్తోంది. దాన్ని టైఫూన్ హిన్నమ్నార్ గా పిలుస్తున్నారు. 2022లో ఇప్పటివరకు భూమిపై నమోదైన అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫానుగా అభివృద్ధి చెందింది. ప్రాణాంతక వరదలు, 185 mph వేగంతో విధ్వంసక గాలులు రాబోతున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. జపాన్ లోని దక్షిణ ద్వీపాలు , దక్షిణ కొరియాలోని కొన్ని భాగాలు ఈ తుఫాన్ దెబ్బకు అల్లకల్లోలం అవుతాయని చెబుతున్నారు.
భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం నాటికి, టైఫూన్ అట్లాంటిక్ మరియు తూర్పు పసిఫిక్ తీరాల్లోని సఫిర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్‌పై కేటగిరీ 4 హరికేన్‌కు సమానమైన 120 mph (195 km/h) వేగంతో గాలి ఒక నిమిషం పాటు వీచింది. గాలులు 172 mph (278 km/h) గా అంచనా వేయబడ్డాయి. వెచ్చని సముద్ర గాలులతో తుఫాన్ ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.
సఫీర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్‌పై 5వ వర్గానికి చెందిన హరికేన్‌గా హిన్నమ్నోర్ బలపడవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.శుక్రవారం బలపడిన తుఫాన్ `హిన్నమ్నోర్` అసాధారణమైన మార్గాన్ని తీసుకునే అవకాశం ఉంది. 8-12 అంగుళాలు (200-300 మిమీ) విస్తృత వర్షపాతం నుంచి 30 అంగుళాల (760 మిమీ) వర్షపాతం దక్షిణ దక్షిణ కొరియా, సుదూర పశ్చిమ జపాన్‌లో దీవుల మీదుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వర్షపాతం గణనీయమైన వరదలకు దారి తీస్తుంది. టైఫూన్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిలిచిపోయినట్లయితే, అక్కడ వర్షపాతం అధిక మొత్తాలను నమోదు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ట్రాక్ టైఫూన్ తీవ్రతను కొనసాగిస్తూ జపాన్‌లోని ర్యుక్యూ దీవులలో చుట్టుపక్కల చాలా రోజుల పాటు ఉంటుంది. దీంతో ఆ ప్రాంతానికి రోజుల తరబడి వర్షపాతం తీవ్రమైన గాలులకు దారి తీస్తుంది. ఇది విపత్తుకు దారితీస్తుంది. ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తుంది.
హిన్నమ్నోర్ తుఫాన్ నుంచి తైవాన్ మరియు చైనాలకు 1 కంటే తక్కువ ప్రభావం ఉంటుంది. వచ్చే వారం ప్రారంభంలో కొరియన్ ద్వీపకల్పం లేదా నైరుతి జపాన్‌లోని భాగాలను ప్రభావితం చేస్తుందని అంచనాగా ఉందని వాతావరణశాఖ ప్రతినిధి నికోల్స్ చెప్పారు. బలహీనమైన స్థితిలో కూడా, తుఫాను ఇప్పటికీ దక్షిణ కొరియా మరియు జపాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రభావవంతమైన వర్షాన్ని సృష్టించగలదని అక్యూవెదర్ వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
Related News

Most Educated Countries: అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో ఇండియా, అగ్రస్థానంలో ఏ దేశం?
చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక పుస్తకం కొనుక్కో అన్న సామెత విద్యార్థులకు మంచి సందేశంగా భావించొచ్చు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే శక్తి కేవలం ఒక విద్యకే ఉంటుంది