HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Off Beat
  • ⁄Tribal Man Makes Wooden Leg For Self

Inspiring Story: కర్రతో కాలు.. ధైర్యంతో పోరు.. కష్టాల కడలిని ఎదురీదిన ఓ విజేత గాథ !!

కష్టం వస్తే కుప్పకూలిపోయే వాళ్ళను చూస్తున్నాం.. జీవిత సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గురించి నిత్యం మీడియాలో వింటున్నాం..

  • By Hashtag U Published Date - 11:30 AM, Thu - 8 September 22
  • daily-hunt
Inspiring Story: కర్రతో కాలు.. ధైర్యంతో పోరు.. కష్టాల కడలిని ఎదురీదిన ఓ విజేత గాథ !!

కష్టం వస్తే కుప్పకూలిపోయే వాళ్ళను చూస్తున్నాం..

జీవిత సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గురించి నిత్యం మీడియాలో వింటున్నాం..

కష్టాలను ఎదురీది కష్టపడి చెమటోడ్చే ఓపిక లేక అడుక్కొని తినే వాళ్ళను చూస్తున్నాం..

నాణేనికి బొమ్మ బొరుసు ఉంటుంది. అలాగే సమస్యలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే సాహసులు కూడా సమాజంలో మన చుట్టూ ఎందరో ఉన్నారు.

అటువంటి ఒక సాహసి.. ఒక విజేతను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయనే మాన్ సింగ్ రామ్ మండావి. ఛత్తీస్ ఘడ్ లోని ఏజెన్సీ ఏరియా బస్తర్ వాస్తవ్యుడు. 31 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో ఆయన తన కుడి కాలును కోల్పోయారు. అయితే ప్రభుత్వమో.. స్వచ్ఛంద సంస్థలో కృత్రిమ కాలు ఇస్తాయని మాన్ సింగ్ రామ్ మండావి ఎదురు చూడలేదు. తానే స్వయంగా కర్రతో ఒక కృత్రిమ కాలిని తయారు చేసుకున్నాడు. దాన్ని ధరించి మునుపటిలా సైకిల్ కూడా తొక్కడం మొదలుపెట్టాడు. సైకిల్ పై తన ఇంటి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్య ఉన్న పొలానికి వెళ్ళాడు. గత 31 ఏళ్లుగా ఇలా కర్ర కాలుతో సైకిల్ తొక్కడం, పొలానికి వెళ్లడం
మాన్ సింగ్ రామ్ మండావి దినచర్యలో భాగం అయిపోయింది.
ఈక్రమంలో ఏ ఒక్క రోజు కూడా తనకు కాలు లేదు.. అనే ఆలోచన ను ఆయన దరి చేరనివ్వలేదు. తన పొలంలో పంట పండించి.. దాన్ని తీసుకెళ్ళి పక్కనున్న టౌన్ లో అమ్మేసి వచ్చే డబ్బులతో కుటుంబాన్ని మాన్ సింగ్ నడుపుతున్నాడు. తన పిల్లలను చదివిస్తున్నాడు. జీవిత పోరాటం అంటే ఏమిటో చూపిస్తున్నాడు.

“కాళ్ళు ..చేతులు విరిగిన వాళ్ళు చాలామంది భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. మీకు అలాంటి ఆలోచన రాలేదా?” అని ప్రశ్నిస్తే మాన్ సింగ్ ఇలా బదులిచ్చారు. “కలలో కూడా భిక్షాటన చేయాలనే ఆలోచన నాకు రాలేదు. కృత్రిమ కాలుతో కష్టపడి జీవించగలను అనే ఆత్మవిశ్వాసమే.. కాలు పోయిన తర్వాత కూడా నన్ను ముందుకు నడిపింది.” అని తేల్చి చెప్పారు.

ఏడాదిన్నర పాటు పని చేస్తుంది..

“నేనే స్వయంగా ఈ కర్ర కాలును తయారు చేసుకుంటాను. దీన్ని ఒకసారి తయారు చేస్తే దాదాపు ఏడాది, ఏడాదిన్నర పాటు పని చేస్తుంది. గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ నాకు ఒక కృత్రిమ కాలు ఇచ్చింది. అయితే అది కొన్ని రోజులకే విరిగిపోవడంతో పక్కన పెట్టాను. ఎవరిపైనా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో స్వయంగా కర్ర కాలును రెడీ చేసుకొని వాడుతున్నాను” అని మాన్ సింగ్ వివరించారు.

జీవితం అనే ఈ యుద్ధంలో నిజమైన విజేత ఎవరు అంటే.. కష్ట కాలాన్ని ధైర్యంగా ఎదురీదే మాన్ సింగ్ లాంటి వాళ్లే. ఈతరం యువత చదువులో , టెక్నాలజీ లో ఎంతో దూసుకుపోతోంది. కానీ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కుప్పకూలుతోంది. సమస్యను ఎలా ఎదుర్కోవాలి? జీవితంలో ఒంటరితనం , ఓటమి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి? ఓటమిని ఓపికగా ఎదుర్కొని విజయంగా ఎలా మార్చుకోవాలి? అనే అంశాల గురించి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాన్ సింగ్ అలుపెరుగని జీవిత పయనం కూడా మనకు ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది.

Tags  

  • chhattisgarh
  • tribal man
  • viral
  • wooden leg
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Elon Musk: ఎలాన్ మాస్క్ పేరు మార్చుకోబోతున్నాడా?

Elon Musk: ఎలాన్ మాస్క్ పేరు మార్చుకోబోతున్నాడా?

టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Video: ఐఫోన్-15 కోసం గొడవ.. వీడియో వైరల్

    Video: ఐఫోన్-15 కోసం గొడవ.. వీడియో వైరల్

  • WhatsApp Ads : వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్‌?.. అందరికి క్లారిటీ ఇచ్చిన మెటా..

    WhatsApp Ads : వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్‌?.. అందరికి క్లారిటీ ఇచ్చిన మెటా..

  • Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి

    Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి

  • Uttar Pradesh : విద్వేషం విద్యాలయాల్లోకి ప్రవేశించిందా?

    Uttar Pradesh : విద్వేషం విద్యాలయాల్లోకి ప్రవేశించిందా?

Latest News

  • Underwater Swarm Drones: అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్‌లు అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

  • India Win Gold Medal: మరో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారత్..!

  • Dengue Prevention Protocols: డెంగ్యూ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • Petrol Rates: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • Hyderabad : గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా నేడు న‌గ‌రంలో వైన్ షాపులు బంద్‌

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version