Shocking : ఆ రాష్ట్రాల్లో మగాళ్ల కంటే ఆడాళ్లకే లైంగిక సంబంధాలు ఎక్కువట!!
టైటిల్ చూసి అది నిజం కాకపోవచ్చు అనుకుంటున్నారా..? కానీ అది నిజం. ఈ విషయాన్ని ఏ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేనో..ఇంకేదో కాదు. ఈ విషయాన్ని చెప్పింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే.
- By hashtagu Published Date - 11:55 AM, Sat - 20 August 22
టైటిల్ చూసి అది నిజం కాకపోవచ్చు అనుకుంటున్నారా..? కానీ అది నిజం. ఈ విషయాన్ని ఏ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేనో..ఇంకేదో కాదు. ఈ విషయాన్ని చెప్పింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. గతంలో కంటే ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా బయటకు రావడం…కొన్ని చోట్ల చేసుకున్న దారుణాల గురించి తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధాలు నడిపే పురుషుల గురించి వింటుంటాం. కొన్ని సందర్బాల్లో వారు దొరికిపోవడం కూడా చూస్తుంటాం.
కానీ తాజాగా సర్వే చెప్పిన షాకింగ్ న్యూస్ ఏంటంటే…దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ లైంగిక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. మహిళలు, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించిన పలు వివరాలను బయటపెట్టింది. 2019-21 మధ్యలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో NFHSసర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాజస్థాన్, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం, హర్యానా, లక్షద్వీప్, పాండిచ్చేర్రీ, తమిళనాడు రాష్ట్రాల్లో మగాళ్ల కంటే ఆడాళ్లే తమ జీవితకాలంలో ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న విషయాన్ని వెల్లడించింది సర్వే.
రాజస్తాన్ ల సగటున ఒక మహిళ 3.1మందిలో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే…పురుషులు 1.8మంది ఉన్నట్లుగా గణాంకాలు వెల్లడించాయి. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లోనే పురుషులు, స్త్రీలు లైంగిక భాగస్వామ్యాల రేటు అధికంగా ఉంది. గతేడాది ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువమందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న పురుషులు 1.2శాతంమంది ఉండగా….జీవితకాలంలో 2.1 మందిలో లైంగిక సంబంధాల్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3శాతం ఉండగా…వారి జీవితకాలంలో పార్టనర్లుగా మారిన వారి సంఖ్య 1.7గా ఉంది. దేశవ్యాప్త గణాంకాల ఇలా ఉంటే..తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?
ఏపీలో గతేడాది ఇద్దరుకంటే ఎక్కువ మందిలో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతం ఉంటే పురుషులు మాత్రం 1.2 శాతం ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఇద్దరికంటే ఎక్కువ మంది శారీరక సంబంధాలు ఉన్న స్త్రీలు 0.4 శాతం కాగా..పురుషులు 2.1 శాతంగా ఉన్నట్లు రిపోర్టుల్లో తేలింది.