Mumbai : దారుణం. వైఫై హాట్ స్పాట్ కు పాస్ వర్డ్ ఇవ్వలేదని యువకుడి హత్య..!!
- By hashtagu Published Date - 07:03 AM, Wed - 2 November 22

నవీ ముంబైలోని కమోతేలో దారుణం జరిగింది. 17ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా చంపారు. హౌసింగ్ సొసైటిలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఓ మైనర్ ను హత్య చేశారు. ఆ బాలుడు చేసిన నేరం ఏంటంటే..అతను తన వైఫై హాట్ స్పాట్ పాస్ వర్డ్ ను నిందితుడికి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడిపై దాడి చేసిన కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అరెస్టు చేసిన నిందితులను రవీంద్ర అత్వాల్, సంతోష్ వాల్మీకిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరు ముగ్గురు పాన్ తప్రీకి వెళ్లారు. వీరిద్దరు..వైఫై హాట్ స్పాట్ పాస్ వర్డ్ ను అడిగారు. మ్రుతుడు పాస్ వర్డ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులై ఆ యువకుడిపై దుర్భాషలాడారు. దీంతో వారిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిందితులిద్దరూ ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా రవీంద్ర కత్తీ వీపుపై పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆ యువకుడు కొట్టుమిట్టాడుతుంటే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. స్థానికులు ఆ యువకుడుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.