HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Saudi Arabia Planning 1 Trillion Skyscraper 1600 Feet In Height Report

సౌదీలో లక్ష కోట్లతో “మిర్రర్ లైన్”.. ఏమిటీ కాస్ట్లీ ప్రాజెక్ట్ ?

భవిష్యత్ లో ఇంధన వనరులు తుడిచిపెట్టుకొని పోతే అరబ్ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది.

  • Author : Hashtag U Date : 25-07-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sky
Sky

భవిష్యత్ లో ఇంధన వనరులు తుడిచిపెట్టుకొని పోతే అరబ్ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. ఈ విపత్తును ముందే ఊహించిన సౌదీ అరేబియా ప్రభుత్వం తమ ఆర్ధిక వ్యవస్థను టూరిజం దిశగా నడిపించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈక్రమంలోనే దాదాపు రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టు “నియోమ్” చేపడుతున్నారు. ఇందులో భాగంగా బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తున్నారు. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా సౌదీ చేపట్టింది. ఈ ఎడారి నగరం నియోమ్ లో ఒక భారీ నిర్మాణం చేపట్టబోతున్నారు. అదే “మిర్రర్ లైన్”. దీని నిర్మాణ బడ్జెట్ రూ.లక్ష కోట్లు. ఈ నిర్మాణం 121 కిలోమీటర్ల వెడల్పు, 488 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇంత పెద్ద విస్తీర్ణంలో నియోమ్ సిటీలోని రోడ్డు వెంట రెండు భారీ బిల్డింగ్స్ కట్టనున్నారు. అష్టభుజి ఆకారంలో ఈ బిల్డింగ్స్ ఉంటాయి. వీటిలో మౌంటెన్ రిసార్ట్ , స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి.మిర్రర్ లైన్ లో కట్టబోయే బిల్డింగ్స్ ఎత్తు.. న్యూయార్క్ లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. ఈ బిల్డింగ్స్ కింది ఒక హై స్పీడ్ ట్రైన్ రూట్ ఉంటుంది. ఈ బిల్డింగ్స్ నుంచి స్థానిక ప్రాంతాల్లో ఎక్కడికైనా నడిచి 5 నుంచి 20 నిమిషాల్లోగా వెళ్లొచ్చు. 2030 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. నియోమ్ అనేది జీరో కార్బన్ సిటీ గా అవిర్భవించనుంది.

నియోమ్ విశేషాలు..

ప్రస్తుతం సౌదీ అరేబియా ఎడారిని స్వర్గంలా మార్చేస్తోంది. ఆ ప్రాజెక్టు పేరు నియోమ్ (NEOM).ఎర్ర సముద్రానికి (Red Sea) వాయవ్య ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఇది మొత్తం టెక్నాలజీపై ఆధారపడే ప్రాజెక్టు. ఇందులో ప్రతీదీ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ప్రతీ భవనం, రోడ్డు, వాహనాలు, పార్కులు, కాంప్లెక్సులు అన్నీ టెక్నాలజీతోనే పనిచేస్తాయి.నియోమ్‌లో ప్రధానంగా మూడు ఉప భాగాలున్నాయి. అవి ఒక్సాగాన్, ట్రోజెనా, ది లైన్. వీటికి సంబంధించి సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఈ సంవత్సరం కీలక ప్రకటన చేశారు. వీటిలో ట్రోజెనా (trojena) ద్వారా నియోమ్ స్మార్ట్ సిటీలో పర్వత టూరిజంను అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో స్కై విలేజ్, అల్ట్రా లగ్జరీ ఫ్యామీలీ అండ్ వెల్‌నెస్ రిసార్టులు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్ల వంటివి ఉంటాయి. సింపుల్‌‌గా చెప్పాలంటే ప్రపంచ టూరిస్టులంతా ఇక్కడికి కచ్చితంగా వెళ్లాలి అనుకునేలా ఇది ఉంటుంది. ఇందులో మౌంటేన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి కూడా ఉంటాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Prince Mohammed bin Salman
  • Saudi Arabia
  • skyscraper
  • viral news

Related News

Ashwin

Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!

తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.

  • Smriti Mandhana

    Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

Latest News

  • AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

  • Chinmayi : చిన్మయి మార్ఫింగ్ ఫోటో వైరల్..

  • Mobile Recharge Price Hike : మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు!

  • CM Revanth : నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ

  • ‎Winter Foot Care: కాళ్ల పగుళ్లతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Trending News

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    • UNESCO: దీపావళికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా!

    • Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

    • Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd