Gift To Contractor : రూ.కోటి రోలెక్స్ గడియారం.. ఇల్లు కట్టిన కాంట్రాక్టరుకు గిఫ్టు
మంచి పనికి.. మంచి గుర్తింపు ఉండాలి. అందుకే మేం మా కాంట్రాక్టరును(Gift To Contractor) గౌరవించుకున్నాం.
- By Pasha Published Date - 05:21 PM, Thu - 31 October 24

Gift To Contractor : తన ఇంటి నిర్మాణ పనులను అద్భుతంగా చేసి పెట్టిన కాంట్రాక్టరుకు పంజాబ్‌కు చెందిన వ్యాపారి గురుదీప్ దేవ్ భట్ వెరీవెరీ కాస్ల్టీ గిఫ్టును అందించారు. ఏకంగా రూ.1 కోటి విలువ చేసే రోలెక్స్ గడియారాన్ని కాంట్రాక్టరు రాజిందర్ సింగ్‌కు అందజేశారు. తన కొత్త ఇంటి సంబురాన్ని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతకీ కాంట్రాక్టరు చేసి పెట్టిన పని ఏమిటి ? ఇంటి నిర్మాణంలో అతడు చూపించిన స్పెషాలిటీ ఏమిటి ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి
వ్యాపారి గురుదీప్ దేవ్ భట్.. పంజాబ్‌లోని షాకోట్ వాస్తవ్యుడు. పట్టణంలో ఆయనకు దాదాపు 9 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో ఇంటిని నిర్మించే కాంట్రాక్టు పనులను రాజిందర్ సింగ్ రూప్రాకు అప్పగించారు. దాదాపు 200 మందికిపైగా కార్మికులతో పనిచేయించి, వాటిని సకాలంలో రాజిందర్ పూర్తి చేయించారు. వ్యాపారి గురుదీప్ దేవ్ భట్ సూచించిన విధంగా ఇంటిని.. రాజస్థానీ కోట నమూనాలో నిర్మించారు. ఈవిషయమే గురుదీప్‌కు బాగా నచ్చింది. అచ్చం కోట తరహా లుక్‌లో తన ఇంటిని రెడీ చేసి ఇచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించారు. ఈసందర్భంగా రూ.కోటి విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను కాంట్రాక్టర్ రాజిందర్‌కు ఇచ్చారు.
Also Read :Beauty Tips: ప్రతిరోజు జుట్టుకు షాంపూ అప్లై చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
‘‘మంచి పనికి.. మంచి గుర్తింపు ఉండాలి. అందుకే మేం మా కాంట్రాక్టరును(Gift To Contractor) గౌరవించుకున్నాం. ఆయనకు రూ.కోటి విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను ఇచ్చుకున్నాం’’ అని వ్యాపారి గురుదీప్ తెలిపారు. రాజస్థానీ కోట లుక్‌లో ఉండేలా తన భవనానికి చుట్టూ గోడను నిర్మించడం చాలా స్పెషల్ అని వివరించారు. పంజాబ్‌లోని షాకోట్ పట్టణంలో స్పెషల్‌గా ఉండే ఇళ్లలో తమ ఇల్లు ఒకటిగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.