Shiva Devotees : అరుణాచలం శివయ్య భక్తులకు IRCTC సూపర్ ప్యాకేజీ
Shiva Devotees : ఈ ప్యాకేజీలో రెండు వసతి శ్రేణులు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ (SL), కంఫర్ట్ (3AC). ప్రయాణికులకు హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, రోడ్డు రవాణా కోసం AC వాహనాలు
- By Sudheer Published Date - 08:09 AM, Sat - 5 July 25

శివ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అరుణాచలేశ్వరుని దర్శించాలనే కోరికను నెరవేర్చేలా IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ (‘Arunachalam Moksha Yatra’) పేరిట ఐదు రోజుల పర్యటనను ప్రారంభించనున్న ఈ ప్యాకేజీ, భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులను కూడా ఆకట్టుకునేలా రూపొందించబడింది. పుదుచ్చేరి, తిరువణ్ణామలై, కాంచీపురం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగుతుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి గురువారం కాచిగూడ – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (17653) లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
Avoid Sugar: చక్కెర మానితే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు – ఒక్క నెల చాలు!
ఈ ప్యాకేజీలో భక్తుల ప్రయాణం భక్తిభావంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఉంటుంది. మొదటి రోజు రాత్రి రైలులో ప్రయాణించిన తరువాత, రెండో రోజు పుదుచ్చేరికి చేరుకుంటారు. అక్కడ అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లే, పారడైజ్ బీచ్‌లను సందర్శిస్తారు. మూడో రోజు తిరువణ్ణామలైకి వెళ్లి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటారు. నాలుగో రోజు కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయం, కామాక్షి అమ్మన్ ఆలయాలను దర్శించి అరక్కోణం నుంచి రైలు ఎక్కతారు. ఐదవ రోజు ఉదయం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ పై ట్రంప్ సంతకం..వైట్‌హౌస్‌లో సంబరాలు
ఈ ప్యాకేజీలో రెండు వసతి శ్రేణులు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ (SL), కంఫర్ట్ (3AC). ప్రయాణికులకు హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, రోడ్డు రవాణా కోసం AC వాహనాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి అందిస్తారు. అయితే లంచ్, డిన్నర్, దర్శన ప్రదేశాల్లో టిక్కెట్లు, టూర్ గైడ్ వంటి సేవలు ఇందులో ఉండవు. ధరలు టూరిస్ట్ ఎంపికపై ఆధారపడి ఉంటాయి, ఇద్దరి షేరింగ్‌కు రూ.13,460 నుంచి రూ.20,060 వరకు ఉన్నాయి. పిల్లల టిక్కెట్లు విత్, వితౌట్ బెడ్ ఆధారంగా వేరుగా లభిస్తాయి. ఈ ప్యాకేజీ ద్వారా శివ భక్తులు ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.