Home Loan EMI: ఇలా చేస్తే మీ హోమ్ లోన్ ఈఎంఐ ఈజీగా రూ. 4 వేలు తగ్గించుకోవచ్చు
Home Loan EMI : ఒకవేళ వడ్డీ రేటులో 0.75 శాతం లేదా అంతకంటే ఎక్కువ తేడా ఉంటే, ముఖ్యంగా లోన్ ప్రారంభ దశలో ఉన్నవారికి రీఫైనాన్స్ చాలా లాభం చేకూరుస్తుంది
- By Sudheer Published Date - 04:15 PM, Wed - 6 August 25

మీ సొంతింటి కలను హోమ్ లోన్‌తో సాకారం చేసుకున్నారా? అయితే ప్రతీ నెలా ఈఎంఐ చెల్లిస్తూ ఉంటారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్‌ను తగ్గించడంతో హోమ్ లోన్‌ల వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. మీరు ఇంకా పాత వడ్డీ రేటు ప్రకారమే ఈఎంఐ చెల్లిస్తున్నట్లయితే, మీ భారాన్ని తగ్గించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రీనెగోషియేషన్, మరొకటి రీఫైనాన్స్. వీటిని అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటే మీరు గణనీయంగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
రీనెగోషియేషన్ లేదా ఇంటర్నల్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది మీ ప్రస్తుత బ్యాంక్‌లోనే కొనసాగుతూ వడ్డీ రేటును తగ్గించుకోవడం. దీని ద్వారా వేరే బ్యాంకుకు మారే అవసరం ఉండదు. అయితే, ఈ ప్రక్రియలో బ్యాంక్ కొన్ని చార్జీలను వసూలు చేస్తుంది. దీని వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. రెండవ మార్గం రీఫైనాన్స్ లేదా ఫుల్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. అంటే, తక్కువ వడ్డీ ఇచ్చే వేరే బ్యాంకుకు మీ హోమ్ లోన్‌ను మార్చడం. ఈ పద్ధతి ద్వారా మీకు మరింత తక్కువ వడ్డీ రేటు లభిస్తే ఈఎంఐ భారం బాగా తగ్గుతుంది. అయితే, ఈ ప్రక్రియలో మళ్లీ కొత్తగా హోమ్ లోన్ తీసుకున్నట్టుగానే వెరిఫికేషన్, లీగల్ చెకింగ్ వంటి ప్రక్రియలు, అదనపు ఖర్చులు ఉంటాయి.
Congress Holds Dharna : రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..దద్దరిల్లిన ఢిల్లీ
వడ్డీ రేటులో మార్పు వల్ల ఎంత ఆదా అవుతుందో ఒక ఉదాహరణతో చూద్దాం. మీరు రూ. 50 లక్షల హోమ్ లోన్‌ను 30 సంవత్సరాల కాలానికి తీసుకున్నారు అనుకుందాం. వడ్డీ రేటు 9.5% నుండి 8.5%కి తగ్గితే, మీ ఈఎంఐ రూ. 43,210 నుండి రూ. 38,530కి తగ్గుతుంది. అంటే, ప్రతీ నెలా రూ. 4,680 ఆదా అవుతుంది. మీ లోన్ ఇంకా 20 ఏళ్లు ఉంటే, 240 నెలలకు గాను మీరు వడ్డీ రూపంలో దాదాపు రూ. 9,36,000 ఆదా చేసుకోగలరు.
అయితే, వడ్డీ రేటులో తేడా ఎంత ఉందో చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. వడ్డీలో తేడా 1 శాతం వరకు ఉంటే, రీనెగోషియేషన్ లేదా రీఫైనాన్స్ చేయడం లాభదాయకం. కానీ వడ్డీ తేడా పావు శాతమో, అర శాతమో ఉంటే, పాత బ్యాంక్‌తోనే కొనసాగడం మంచిది. అలాగే, మీ లోన్ మరో కొన్ని సంవత్సరాల్లో ముగిసిపోతుందంటే, ఈ ప్రక్రియలు అవసరం ఉండదు. ఒకవేళ వడ్డీ రేటులో 0.75 శాతం లేదా అంతకంటే ఎక్కువ తేడా ఉంటే, ముఖ్యంగా లోన్ ప్రారంభ దశలో ఉన్నవారికి రీఫైనాన్స్ చాలా లాభం చేకూరుస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీరు మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.