Meta FB Layoff : ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్…భారీగా ఉద్యోగాల కోత..!!
- By hashtagu Published Date - 09:51 AM, Wed - 9 November 22
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోగానే…భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పడు ఎలన్ మస్క్ బాటలోనే మార్క్ జుకర్ బర్గ్ నడుస్తున్నారు. ఫేస్ బుక్, మెటాలో పెద్దెత్తున ఉద్యోగులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది సోషల్ మీడియా దిగ్గజాలకు కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ నెలాఖరులో హెచ్చరికలు కూడా జారీ చేశారు జూకర్ బర్గ్. ఇదంతా మోటా ఖర్చులను తగ్గించుకోవడంతోపాటుగా టీంలను పునరుద్ధరించడంలో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఫేస్ బుక్ కు అనుచర కంపెనీగా మెటాను చేశాడు జూకర్ బర్గ్.
అయితే ఆశించిన ఫలితాలు రాకపోవడంతో…ఉద్యోగాల తొలగింపు ప్రక్రియకు మూలంగా మారినట్లయ్యింది. అయితే ఉద్యోగాల కోతకు సంబంధించిన అంశంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు మెటా. గత కొంత కాలంగా ఖర్చులు పెరగడం, ఆదాయాలు, రాబడి తగ్గడం ఇవన్నీ కూగా ఉద్యోగులను తొలగించడానికి కారణాలుగా చూపిస్తోంది ఫేస్ బుక్.
ఇవాళ్టి నుంచే ఉద్యోగాల కోత విధించాలని నిర్ణయించినట్లు సమచారం. ఉద్యోగుల తీసివేతకు సంబంధించి ఫేస్ బుక్ మెటా సీఈవో ఎగ్జిక్యూటివ్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి తాను కూడా కారణమే అని జూకర్ బర్గ్ చేపినట్లు సమాచారం. ముందస్తు వ్యూహంలో భాగంగా 2023లో కొత్త ఉద్యోగాలు ఉండవంటూ చెప్పకనే చెప్పారు జుకర్ బర్గ్.
Tags
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.