Mutual Funds: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా?
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే అన్ని విషయాలు తెలుసుకోవాలి. రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Sun - 5 March 23

రోజుకు రూ. 50 పొదుపు చేస్తే ఎంత పొందొచ్చు? ఈ మొత్తం చూడటానికి ఈ రోజు చాలా చిన్నగా కనిపించొచ్చు. కానీ రోజూ రూ. 50 పొదపు చేస్తే.. నెల చివరిలో రూ. 1500 లభిస్తాయి. ఈ మొత్తాన్ని నెల చివరిలో మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లో పెడితే అదిరే రాబడి పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఊదాహరణ చూడాల్సిందే. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది 1996 అక్టోబర్ 29న ప్రారంభం అయ్యింది. ఈ ఫండ్ 11.47 శాతం రాబడిని ఇచ్చింది. అంటే ఇది అదిరే రాబడి అని చెప్పుకోవచ్చు.
గత మూడేళ్లలో చూస్తే.. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ వార్షికంగా 47.25 శాతం మేర రాబడిని ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్‌కు ఇది వర్తిస్తుంది. అదే డైరెక్ట్ ప్లాన్ అయితే 49.23 శాతం మేర రాబడి వచ్చింది. ఇది చాలా ఎక్కువ రాబడ అని చెప్పుకోవచ్చు. ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఆరంభం నుంచి నెలకు రూ. 1500 చొప్పున సిప్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం రూ. 30 లక్షలకు చేరి ఉండేది. అదే గత మూడేళ్లలో చూస్తే.. రూ. 1500 సిప్ మొత్తం ఏకంగా రూ. 1.2 లక్షలకు చేరి ఉండేది.
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది క్యాపిటల్ అప్రిసియేషన్ లక్ష్యంగా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు అదిరే ప్రాఫిట్ అందించాలని దీన్ని తీసుకువచ్చారు. ఈ ప్లాన్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అయినా కూడా ఇది మంచి రాబడి అందిస్తోంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో రూ. 5 వేల మొత్తంతో చేరొచ్చు. తర్వాత రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ ఎక్కువగా 12.45 శాతం మొత్తాన్ని బ్యంకింగ్ స్టాక్స్‌లో పెట్టింది. తర్వాత ఎఫ్ఎంసీజీలో 9.39 శాతం, కన్‌స్ట్రక్షన్‌లో 6.74 శాతం, మెటల్స్‌లో 5.74 శాతం, ఫార్మాలో 5.3 శాతం, ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్ చేసింది.
ఐటీసీ, జిందాల్ స్టెయిన్‌లెస్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, బికాజి ఫుడ్స్, హిందుస్తాన్ కాపర్, హెచ్ఎఫ్‌సీఎల్, అర్చీన్ కెమికల్ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్ వంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ అనేది స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టే వారు రిస్క్ ఉంటుందని కచ్చితంగా గుర్తించుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నష్టపోవచ్చు.
Also Read: Andrey Botikov: స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్య.. !

Related News

Campa Soft Drinks: సాఫ్ట్ డ్రింక్స్ పై కొత్త వ్యూహాన్ని పన్నిన జియో!
భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏళ్లుగా కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్‌పై..