MP : మహిళ చేతిపై తన మొబైల్ నెంబర్ రాసిన IASఅధికారి. వీడియో వైరల్..!!
- By hashtagu Published Date - 08:44 AM, Mon - 21 November 22

సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ ఐఏఎస్ అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అసలు విషయం ఏంటంటే..మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాకు చెందిన కలెక్టర్ వికాస్ మిశ్రా తన మొబైల్ నెంబర్ ను ఓ మహిళా చేతిపై రాసాడు. దిండోరి జిల్లా పర్యటకు ఐఏఎస్ మిశ్రా వెళ్లారు. ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు…ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ మహిళ కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వికాస్ మిశ్రా…ఆ మహిళ చేతిపై ఫోన్ నెంబర్ రాశారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి అంటూ సూచించారు.
#डिंडोरी DMविकास मिश्रा का यह नवाचार जिले वासियों को खूब भा रहा है। मामला लकड़ी बेचने वाली गोपालपुर निवासी बैगा महिला से जुड़ा है,DM ने मुलाकात कर योजना मिलने का सवाल किया था।@Ajaydubey9@Sandeep_1Singh_
काश @CMMadhyaPradesh
ऐसे DM पहले भेज देते तो डिंडोरी आगे होता। pic.twitter.com/GIN3COoPSV— Deepak Tamrakar दीपक ताम्रकार (@DeepakTDindori) November 20, 2022
ఆ మహిళను కలెక్టర్ ఇలా అడిగారు. మీ దగ్గర మొబైల్ ఉందా. ఇది నా నెంబర్, ఊరిలో ఎవరి దగ్గర అయినా మొబైల్ ఉంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులను మీ గ్రామానికి రప్పించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ సిబ్బందితో కలిసి కాలిన నడకన వెళ్తున్న కలెక్టర్ కు ఎదురుగా వచ్చిన గిరిజన మహిళ ఇలా ఫిర్యాదు చేసింది. మహిళా ఫిర్యాదు తో స్పందించిన కలెక్టర్…ప్రభుత్వం పరంగా అందాల్సిన పథకాలను వెంటనే వారికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లంచం తీసుకుని పనిచేసే ఈ రోజుల్లో మొబైల్ నెంబర్ ఇచ్చిఫోన్ చేయండి అని చెప్పే కలెక్టర్ మీరే అంటూ అభినందిస్తున్నారు.
Related News

Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు సోమవారం ముఖ్యమంత్రి పదవి (Madhya Pradesh CM)పై ఉత్కంఠకు తెరపడింది.