Beauty Tips : మీ నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే?
మామూలుగా చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పెదా
- By Anshu Published Date - 03:30 PM, Tue - 16 January 24

మామూలుగా చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పెదాలు ఎర్రగా మారడం కోసం అనేక రకాల బ్యూటీ టిప్స్, రకరకాల హోమ్ రెమిడీలను పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమందికి పెదాలు అలాగే నల్లగా ఉంటాయి. పెదవులు నల్లగా మారడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పెదవులపై నలుపు పోవడం లేదా. ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాను పాటిస్తే చాలు నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారాల్సిందే. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికొస్తే..
పెదవులు శీతాకాలంలో పగుళ్లు రావడం పొడిబారడం సమస్యలు ఎదురవుతాయి అందుకే నల్లగా మారిన పెదవుల కోసం ఈ చిట్కా పెదవులు గులాబీ వర్ణంలోకి మారడానికి ఒక స్పూన్ పంచదారలో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవాలి ఒకవేళ ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె లేదా బాదం ఆయిల్ ను తీసుకోవచ్చు. ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. తరువాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇది దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. తరువాత ఇంకొక చిట్కా కోసం దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి ఆయిల్ ను తీసుకొని, ఇందులోకి వ్యాస్లీన్ పెట్రోలియం జెల్లీ వేసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి.
తర్వాత స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ మూడు పదార్థాలని కలిపిన చిన్న గిన్నెను నీటి మధ్యలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. దీన్ని చల్లార్చిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసిన వీటితో ప్రతిరోజు ముందుగా మనం తయారు చేసుకున్న స్క్రబ్ తో పెదాలను ఒక నిమిషం పాటు స్క్రబ్ చేసుకోవాలి. తరువాత పెదవులను శుభ్రం చేసి మనం చేసుకున్న ఈ పేస్ట్ ను పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల పెదవుల మీద ఉన్న మృత కణాలు తగ్గిపోయి గులాబీ వర్ణంలోకి పెదవులు మారుతాయి. వీటిని పురుషులు కూడా ఎటువంటి భయం లేకుండా సందేహాలు లేకుండా ఉపయోగించవచ్చు.