HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >World Biryani Day 2023 5 Best Biryanis In India

Biryani: ఇండియాలో ఈ 5 రకాల బిర్యానీలు ఫేమస్.. మీరు కూడా వీటిని ఒక్కసారి రుచి చూడాల్సిందే..!

భారతదేశంలో అనేక రకాల వంటకాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ (Biryani) ఒకటి.

  • Author : Gopi Date : 02-07-2023 - 2:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Biryani
Mutton Biryani

Biryani: భారతదేశం వంటకాలు, వాటి ప్రత్యేక రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో అనేక రకాల వంటకాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ (Biryani) ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం. బిర్యానీకి ఉన్న ఈ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ రోజు భారతదేశంలో దొరికే 5 బిర్యానీల గురించి మనం తెలుసుకుందాం. అవి వాటి రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, ఐకానిక్ బిర్యానీలలో ఒకటి. హైదరాబాదీ బిర్యానీ రుచి, బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది. ఇది సాంప్రదాయకంగా చికెన్ లేదా మటన్ తో తయారు చేయబడుతుంది. తరచుగా వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్లతో హైదరాబాదీ బిర్యానీ గార్నిష్ చేస్తారు.

లక్నో బిర్యానీ

లక్నో బిర్యానీకి కూడా మంచి పేరుంది. ఈ వంటకం పురాతన కాలంలోని నవాబులు, ప్రభువులచే ఎక్కువగా ప్రచారం చేయబడిందని చెబుతారు. దీన్ని తాజా సుగంధ ద్రవ్యాలతో కలిపి వండుతారు. మెరినేట్ చేసిన చికెన్ ను జోడించి వెరైటీ టెక్నిక్ తో చేసే ఈ బిర్యానీ అద్భుత రుచిని తెస్తుంది. లక్నో బిర్యానీ సాధారణంగా బాస్మతి బియ్యం, చికెన్ లేదా మటన్‌తో తయారు చేస్తారు.

కోల్‌కతా బిర్యానీ

కోల్‌కతా బిర్యానీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది అవధి, మొఘలాయ్ వంటకాలచే ప్రభావితమవుతుంది. ఇది సుగంధ బాస్మతి బియ్యం, మాంసం (సాధారణంగా చికెన్ లేదా మటన్), సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేయబడుతుంది. బంగాళదుంపలు, దాల్చినచెక్క, జాజికాయ వంటి సుగంధాలను ఉపయోగించడం కోల్‌కతా బిర్యానీని విభిన్నంగా చేస్తుంది. బెంగాల్ నవాబులు సాంప్రదాయ బిర్యానీకి బెంగాలీ టచ్ ఇచ్చారని, ఫలితంగా దీనికి అవధి బిర్యానీ అని పేరొచ్చినట్టు సమాచారం. ఇందులో పెరుగు, మాంసం, బంగాళాదుంపలు, ఉడికించిన గుడ్లతో పాటు తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో వండుతారు.

Also Read: Floating Restaurant : ఇండియాలో మరో తేలియాడే రెస్టారెంట్.. టూర్ ప్యాకేజ్ వివరాలివీ

మలబార్ బిర్యానీ

కేరళలోని మలబార్ ప్రాంతంలో మలబార్ బిర్యానీ ప్రత్యేకం. సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చిన్న గింజలతో కూడిన జీరకసాల బియ్యంతో తయారు చేయబడిన ఇది ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది. మలబార్ బిర్యానీని సాధారణంగా చికెన్, మటన్ లేదా చేపలతో తయారుచేస్తారు. తరచుగా రహితా (పెరుగు చట్నీ) లేదా ఊరగాయతో వడ్డిస్తారు.

సింధీ బిర్యానీ

సింధీ బిర్యానీ అనేది సింధ్ ప్రాంతం (ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగం) నుండి వచ్చిన సింధీ వంటకాల ప్రత్యేక వైవిధ్యం. ఇది సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యం, మాంసం (సాధారణంగా మటన్ లేదా చికెన్)తో తయారు చేయబడిన రుచికరమైన, స్పైసీ బిర్యానీ. సింధీ బిర్యానీ బిర్యానీలన్నింటిలోనూ భిన్నంగా ఉంటుంది. సింధీ బిర్యానీలో మెత్తగా కోసిన మిరపకాయలు, కొత్తిమీర, తాజా పుదీనా, కాల్చిన మసాలాలను వేస్తారు. డ్రై ఫ్రూట్స్, గింజలు, ఉల్లిపాయ రింగులతో ఈ డిష్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biryani
  • Chicken Biryani
  • food
  • mutton biryani
  • World Biryani Day

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd