Pimples: ఇప్పుడు చెప్పినట్టు చేస్తే చాలు.. రాత్రికి రాత్రే ముఖంపై మొటిమలు అవ్వాల్సిందే!
మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చాలు రాత్రికి రాత్రి ముఖంపై ఉండే మొటిమలు మాయం అవ్వడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:30 PM, Sat - 3 May 25

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ మొటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడడం గుంతలు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ముఖంపై మచ్చలు మొటిమలు వంటివి ఎక్కువ అయిపోయి ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. మొటిమలను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించక దిగులు చెందుతూ ఉంటారు.
అయితే మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పటికిప్పుడు ముఖంపై మొటిమ వస్తే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే ఆ మొటిమ పోవాలంటే కలబంద గుజ్జు ఉపయోగించాల్సిందే. కలబంద గుజ్జును ఐస్ క్యూబ్ లో పెట్టి గట్టిపడనివ్వాలి. తర్వాత దానిని ముఖంపై రుద్దితే మొటిమలు కనిపించవట. ఇలా కాసేపటి వరకు దానిని కంట్రోల్ చేయవచ్చట. చాలా మంది తమ గోళ్లను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ గోరు విరిగిపోతే చాలా బాధపడిపోతారు. ఇలా జరిగితే గోరు విరిగిన ప్రాంతంలో టిష్యూ పేపర్ పెట్టి దాని మీద నెయిల్ కలర్ లో ఉండే నెయిల్ పాలిష్ వేయాలి.
అది ఆరిన తర్వాత మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చట. సడెన్ గా ముఖంపై ఏదైనా మచ్చ వచ్చి అది ముఖం అందం పోగొడుతుందా. అన్నప్పుడు ఒక బ్రష్ తీసుకొని దానిపై టూత్ పేస్ట్ పెట్టి కొద్దిగా బేకింగ్ పౌడర్ చల్లాలి. తర్వాత దానిని ఆ మచ్చలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలను ఇన్ స్టాంట్ గా తొలగించవచ్చట. వీటితోపాటు తరచుగా కలబంద జెల్ ఉపయోగించడంతోపాటు విటమిన్ సి ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా ముఖంపై మొటిమలు రావు అని చెబుతున్నారు.