Wife Self Pleasure : భార్య హస్త ప్రయోగం, అశ్లీల వీడియోల ఆధారంగా నో డైవర్స్
‘‘అశ్లీల వీడియోలను చూసే విషయంలో భార్యాభర్తలు(Wife Self Pleasure) చట్టాలను ఉల్లంఘించకపోతే.. దానివల్ల మరో జీవిత భాగస్వామి దాంపత్య బాధ్యతలపై ప్రతికూల ప్రభావం పడకపోతే.. అలాంటి చర్యలను క్రూరత్వంగా పరిగణించం.
- By Pasha Published Date - 08:14 PM, Thu - 20 March 25

Wife Self Pleasure : మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అశ్లీల వీడియోలను చూసి, తరచూ హస్తప్రయోగం చేసుకుంటోందనే కారణంతో భార్య నుంచి విడాకులు కోరుతూ తమిళ నాడులోని కరూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. జీవిత భాగస్వామి అశ్లీల వీడియోలను చూడటం, హస్త ప్రయోగం చేసుకోవడం అనే చర్యలు వైవాహిక బంధంలో క్రూరత్వం కిందికి రావని హైకోర్టు తేల్చి చెప్పింది.
Also Read :Wife Victim : మరో భార్యా బాధితుడు.. రోజూ రూ.5వేలు ఇస్తేనే కాపురమట
పిటిషన్‌లో ఆరోపణలు ఇవీ..
తన భార్య నుంచి విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సదరు వ్యక్తి మద్రాసు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశాడు. ‘‘నాకు 2018 జులైలో పెళ్లి జరిగింది. 2020 డిసెంబరు నుంచి భార్య విడిగా ఉంటోంది. నా భార్య అశ్లీల వీడియోలకు బానిసైంది. ఇంటి పనులు చేయడానికి నిరాకరిస్తుంది. తరచూ హస్తప్రయోగం చేసుకుంటుంది. ఆమె లైంగిక సంబంధ వ్యాధితో బాధపడుతోంది’’ అని ఈ పిటిషన్‌లో ఆరోపించాడు.
కోర్టు కీలక వ్యాఖ్యలు
‘‘అశ్లీల వీడియోలను చూసే విషయంలో భార్యాభర్తలు(Wife Self Pleasure) చట్టాలను ఉల్లంఘించకపోతే.. దానివల్ల మరో జీవిత భాగస్వామి దాంపత్య బాధ్యతలపై ప్రతికూల ప్రభావం పడకపోతే.. అలాంటి చర్యలను క్రూరత్వంగా పరిగణించం. అందుకే ఈ కేసులో భార్య నుంచి విడాకులు ఇవ్వలేం’’ అని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ‘‘ప్రైవేటు వాతావరణంలో జీవిత భాగస్వామి అశ్లీల వీడియోలను చూడటం నేరం కాదు. పురుషుల్లో హస్తప్రయోగం సార్వజనీనం అని అంగీకరిస్తే, మహిళలు హస్త ప్రయోగం చేయడాన్ని తప్పుగా చూడకూడదు’’ అని న్యాయస్థానం పేర్కొంది. ‘‘పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా మహిళ ఇతరులతో సంబంధం పెట్టుకుంటే అది విడాకులకు కారణం కావచ్చు. హస్త ప్రయోగం ద్వారా జీవిత భాగస్వామికి స్వీయ ఆనందం మాత్రమే దొరుకుతుంది. వారి దాంపత్య బంధం కలుషితం కాదు. ఈ అంశం భర్తపై క్రూరత్వం కానే కాదు’’ అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమ ఉన్నారు.