Bathing Vs Peeing : స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా ?
Bathing Vs Peeing : శరీరంపై ఉన్న మలినాలను తొలగించేందుకు మనం స్నానం చేస్తుంటాం.
- Author : Pasha
Date : 26-02-2024 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
Bathing Vs Peeing : శరీరంపై ఉన్న మలినాలను తొలగించేందుకు మనం స్నానం చేస్తుంటాం. ఈక్రమంలో కొంతమంది స్నానం చేస్తుండగానే మూత్ర విసర్జన చేస్తుంటారు.. స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం ‘మంచిదేనా’ అంటే.. ‘మంచిది కాదు’ అని నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో వివిధ రకాల మలినాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ కారకాలు కూడా మూత్రంలో కలిసి ఉంటాయి. ఇలాంటివి శరీరానికి తాకితే.. ఇన్ఫెక్షన్ సోకే రిస్క్ ఉంటుంది. అందుకే స్నానం చేస్తుండగా మూత్ర విసర్జన (Bathing Vs Peeing) అస్సలు చేయకూడదు.
We’re now on WhatsApp. Click to Join
- కొందరు బాత్ టబ్‌లో స్నానం చేస్తుంటారు. బాత్ టబ్‌లోని సబ్బు నీటిలోకి మూత్రం విసర్జిస్తే.. అది కలిసిపోయి నీటిని కలుషితం చేస్తుంది. ఒళ్లు మొత్తానికి మూత్రం అంటుకొని ఇన్ఫెక్షన్స్ వచ్చేలా చేస్తుంది.
- కొంత మంది అథ్లెట్ల పాదాల నుంచి ఫంగస్, బ్యాక్టీరియాను తొలగించడానికి పాదాలను మూత్రంతో తడుపుతారట.
- ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో నీటి కొరత చాలా ఉంది. అక్కడ చాలా మంది స్నానం చేసేటప్పుడు మూత్రవిసర్జన చేస్తారు.
Also Read : Jayalalitha Jewellery : 100 కోట్ల జరిమానా రికవరీ.. 28 కిలోల జయలలిత నగల వేలం
మనం స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడితే బెటర్. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్సహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు నీరు ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. కొంత మందికి అన్నం తిన్న తర్వాత స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. రోజూ ఉదయం, సాయంత్రం తినకముందు స్నానం చేయడం బెటర్.
Also Read : TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
- మూత్ర విసర్జన చేసిన వెంటనే నోరు పుక్కిలించకూడదు. ఒకవేళ అలా చేస్తే వెంటనే మళ్ళీ మూత్రం వస్తుంది.
- మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అంతే కాదు భోజనం చేసిన వెంటనే మూత్రవిసర్జన తప్పనిసరిగా చేయాలి . దీనివల్ల కిడ్నీలు పాడవకుండా ఉంటాయి.
- రాత్రి పడుకునే ముందు కూడా మూత్ర విసర్జన చేసి పడుకోవాలి.
- స్నానానికి అరగంట ముందు కానీ, అరగంట తర్వాత కానీ మర్చిపోయి కూడా మూత్ర విసర్జన చేయకూడదు. అలా చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.
- మూత్ర విసర్జన చేసే సమయంలో మంట లేదా దురదగా అనిపిస్తే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఎప్పుడైనా ఎక్కువ నూనె, మసాలా, మైదాతో చేసిన భోజనం తింటే, తిన్న గంట తర్వాత ఎక్కువ నీరు తాగాలి . వీలైతే గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.