Beauty Tips: కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమవుతుందో తెలుసా?
మీరు ఎప్పుడు అయినా కలబంద గుజ్జు మాత్రమే కాకుండా కలబందతో పాటు తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Wed - 7 May 25

కలబంద ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబందను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనా లను పొందవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కలబందను చాలా ఆరోగ్య ప్రయోజనాల కోసం కంటే అందం కోసమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు న్యాచురల్ గా దొరికే కలబంద మొక్క నుంచి నేరుగా జెల్ అప్లై చేస్తే మరి కొందరు మార్కెట్లో దొరికే జల్ ని అప్లై చేస్తూ ఉంటారు. కలబంద ఉపయోగించడం వల్ల అందం కూడా రెట్టింపు అవ్వడంతో పాటు చర్మ సమస్యలు మొటిమలు వంటి సమస్యలు కూడా రావు.
కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయట. అదేవిధంగా తేనె కూడా మన చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి మొటిమల సమస్యను కూడా తగ్గిస్తాయట. ఎప్పుడైనా తేనె అలాగే కలబంద రెండు కలిపి ముఖానికి అప్లై చేశారా? ఇలా అప్లై చేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబంద, తేనె రెండూ కలిపి ముఖానికి రాయడం వల్ల అందం రెట్టింపు అవుతుందట.
మన ముఖంపై డెడ్ సెల్స్ తొలగించడంలో సహాయం చేస్తాయట. అలాగే ముఖంపై ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడతాయట. ఈ రెండూ కలిపి రాయడం వల్ల ముఖం చాలా బాగా క్లెన్స్ అవుతుందని అంతేకాకుండా రెండూ కలిపి రాయడం వల్ల ముఖంలో గ్లో తీసుకువస్తుందని చెబుతున్నారు. ఈ రెండూ కలిపి రాయడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దాని వల్ల చర్మానికి రిలాక్సేషన్ ఇస్తుందని ఈ క్రమంలో ముఖంలో గ్లో పెరుగుతుందని చెబుతున్నారు. చాలా మంది ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ రెండూ కలిపి రాయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాకుండా మొటిమల తాలుకూ మచ్చలు కూడా తొలగిపోవడానికి సహాయం చేస్తుందట. ఆయిల్ స్కిన్ కూడా నార్మల్ గా మారుతుందట. కాబట్టి తేనె కలబంద రాస్తే మంచి ప్రయోజనాలే తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెబుతున్నారు. కాకపోతే మీ చర్మ స్థితిని బట్టి, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.