Interview Dress Codes : ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్‌లను ధరించండి
ట్రెడిషనల్ (Traditional), ట్రెండీ డ్రెస్సుల్లో ఇంటర్వూకి వెళ్లై టైమ్‌లో ఏది ధరిస్తే మంచిది..?
- By Maheswara Rao Nadella Published Date - 10:00 AM, Sun - 1 January 23
జాబ్ ఇంటర్వ్యూ (Job Interview) కోసం ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు అన్నీ రకాలుగా ప్రిపేర్ అయిన తర్వాత చివరగా కలిగే ఆలోచనే డ్రెస్ కోడ్. ఇంటర్వూకి ఏ డ్రెస్ వేసుకెళ్తే బాగుంటుంది అనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సుల్లో ఇంటర్వూకి వెళ్లై టైమ్‌లో ఏది ధరిస్తే మంచిది? ఏ రంగు దుస్తులు బాగుంటాయి? మీరు ప్రొఫెషనల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? ఎలాంటి దుస్తులు ధరించాలి అనే ఆలోచన మీకు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందుకే జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించడం ఉత్తమం. ఇంటర్వ్యూకి కొన్ని రంగులు చాలా బాగుంటాయి. ఆ రంగులు ఏమిటో తెలుసుకుందాం.
చాలా సార్లు జాబ్ కోసం జరిగే ఇంటర్వూలకు వెళ్లే వాళ్లలో చాలా మంది వాళ్లు వేసుకెళ్లే డ్రెస్సుల వల్లే తిరస్కరించబడతారు. ఇంటర్వూలో సెలక్ట్ అయి సక్సెస్‌ఫుల్‌గా జాబ్ సాధించాలంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూకు (Interview) వెళ్లేటప్పుడు ప్రొఫెషనల్ లేదా లేత రంగుల దుస్తులను సెలక్ట్ చేసుకోవాలి. దుస్తులు మీ వృత్తికి సరిపోతాయని కూడా గుర్తుంచుకోండి.
ముఖ్యంగా పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ఫార్మల్ షర్ట్ , ప్యాంటు వేసుకుంటే బెటర్. ఆడవాళ్లైతే సాధారణ కుర్తా, చీర, ప్యాంట్ సూట్ ధరించవచ్చు. ఇక ఏ ఏ రంగులు అయితే బాగుంటాయనే విషయాన్ని మీ మీ శరీరం, ఫేస్ రంగును బట్టి ఈ కింది విధంగా డ్రెస్ కోడ్ ఫాలో అయితే మంచిది.
1. ఏ ఇంటర్వ్యూకైనా బ్లూ కలర్ దుస్తులు ధరించవచ్చు. ఈ రంగు మిమ్మల్ని నమ్మదగినట్లుగా చూపిస్తుంది. అంతే కాకుండా కష్టపడి పనిచేసేదిగా చూపుతుంది.
2. బూడిద రంగు తటస్థ రంగుగా పరిగణించబడుతుంది. కొత్త విషయాలను నేర్చుకునే, జ్ఞానాన్ని పొందే గుణాలను ఈ రంగు చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
3. నలుపు: మీరు ఉన్నత స్థానానికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లయితే మీరు బ్లాక్ షర్ట్ లేదంటే డ్రెస్‌లు వేసుకోవచ్చు. ఇది మీ నాయకత్వ సామర్థ్యాన్ని చూపుతుంది. కానీ ఫస్ట్ ఇంటర్వూకి మాత్రం బ్లాక్ డ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకెళ్లకూడదని గమనించాలి.
4. ఇంటర్వూ చేసే వ్యక్తులు, అక్కడ యాజమాన్యం దృష్టిలో సానుకూల ముద్ర వేయడానికి వైట్ డ్రెస్‌లు వేసుకోవడం మంచిది. మీరు ఏ రంగును అర్థం చేసుకోలేకపోతే తెల్ల రంగును సెలక్ట్ చేసుకోవడం చాలా బెటర్.
Also Read: New Year Gifts 2023 : ఈ టెక్ గాడ్జెట్స్ ని న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా ఇవ్వండి…
Related News
POWERHOUSE Interview : మరో ‘పవర్’ ను ఇంటర్వ్యూ చేయబోతున్న TV9 రజనీకాంత్
రీసెంట్ గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు మరో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు