Beauty Tips: ఒత్తైన జుట్టుతో పాటు మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
చర్మ సౌందర్యం రెట్టింపు అవడం కోసం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:32 AM, Mon - 26 May 25

చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలి అన్నా అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అన్నా కొన్ని రకాల విటమిన్లు అవసరం. మరి ముఖ్యంగా విటమిన్ ఈ చాలా అవసరం అని చెబుతున్నారు. అయితే విటమిన్ ఈ కోసం చాలా మంది మార్కెట్లో దొరికే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి ఎంత మాత్రం మంచిది కాదని, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు పొందవచ్చని చెబుతున్నారు.
ఇకపోతే విటమిన్ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుందట. దీనివల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి, చర్మం మెరుస్తుందని,జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్ ఈ ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని గింజల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుందట. సన్ ఫ్లవర్ గింజలు, వేరుశనగలు, పిస్తా, గింజలు, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తినడం ద్వారా విటమిన్ ఈ పొందవచ్చని చెబుతున్నారు. పాలకూర, బ్రోకలీ, బీట్‌రూట్ ఆకుకూర, కోలార్డ్ ఆకు కూరల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుందట. క్యాప్సికం, గుమ్మడి కాయను కూడా తినవచ్చట.
ఇది చర్మ, జుట్టు ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కాగా విటమిన్ ఈ కోసం కొన్ని పండ్లు తినాలట. మామిడి, బ్లాక్‌బెర్రీ, రాస్ప్బెర్రీ, కివీ, అవకాడో వంటి పండ్లలో విటమిన్ ఈ ఉంటుందని, వీటితో స్మూతీలు, ఫ్రూట్ చాట్ చేసుకుని తినవచ్చని, వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయని వీటిని తినడం ద్వారా విటమిన్ ఈ పొందవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా కోడి గుడ్డు లోని పచ్చసొనలో విటమిన్ ఈ ఉంటుందట.గుడ్డు తినడం అలవాటు ఉంటే రోజూ తినవచ్చట. కొన్ని చేపలు కూడా విటమిన్ ఈ కి మంచి వనరులు. కొన్ని నూనెల్లో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, కొబ్బరి నూనె లాంటివి కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.