Vegetable Lollipops: ఎప్పుడైనా వెజిటేబుల్ లాలీపాప్స్ తిన్నారా.. ట్రై చేయండిలా?
మామూలుగా పిల్లలకు హాలిడేస్ వచ్చాయి అంటే చాలు ఇంట్లో అమ్మలను ఏదైనా స్పెషల్ గా కొత్తగా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ
- By Anshu Published Date - 07:50 PM, Wed - 6 September 23

మామూలుగా పిల్లలకు హాలిడేస్ వచ్చాయి అంటే చాలు ఇంట్లో అమ్మలను ఏదైనా స్పెషల్ గా కొత్తగా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన రెసిపీలు కాకుండా ఏవైనా కొత్తగా స్నాక్స్ చేయాలని ఇంట్లో అమ్మలు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లలకు ఏవైనా కొత్తగా రెసిపీలు చేసి పెట్టాలి అనుకునే వారి కోసం ఈ సరికొత్త రెసిపీ. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజిటేబుల్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలి. అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వెజిటెబుల్ లాలిపాప్స్ కి కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళదుంపలు – 3 లేదా 4
కేరట్ తురుము – 1 కప్పు
ఉల్లి తరుగు – 1 కప్పు
పనీర్ – 50 గ్రా
మైదా, కార్న్ ఫ్లోర్ కలిపి – 2 చెంచాలు
మ్యాగీ మసాలా పొడి – 1/2 చెంచా
చాట్ మసాలా పొడి – 1/2 చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
బ్రెడ్ పౌడర్ – 1/2 కప్పు
ఉప్పు, కారం – తగినంత
టూత్ పిక్స్ – కొన్ని
వెజిటెబుల్ లాలిపాప్స్ తయారి విధానం:
ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మెదుపుకోవాలి. అందులో పనీర్ తురుము, కేరట్ తురుము, ఉల్లితరుగు వేసుకోవాలి. అలాగే మేగి మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ జత చేసి బాగా కలుపుకోవాలి. అలా తయారయిన ముద్దని చేతికి అంటుకోకుండా ఉండటానికి కాస్త నూనే రాసుకుని మనకి ఇష్టమైన షేప్ లో వాటిని తయారుచేసుకోవాలి. అలా తయారయిన వాటిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో మైదా కార్న్ ఫ్లోర్ ని వేసి నీళ్ళు కలిపి జారుగా కలుపుకోవాలి. అలా కలిపిన దానిలో పొటాటో బాల్స్ డిప్ చేసి బ్రెడ్ పౌడర్ లో దొర్లించి కాగిన నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. అలా తయారయిన వాటికి టూత్ పిక్స్ గుచ్చాలి. వీటిని టమాటో సాస్ తో గాని చిల్లి సాస్ తో గాని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి.