Vastu Tips For Money: ఈ పువ్వును ఖజానాలో ఉంచితే.. ఇక డబ్బే డబ్బు?
సాధారణంగా చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు ఎన్నో విషయాలలో కూడా వాస్తు విషయాలను నమ్ముతూ
- By Nakshatra Published Date - 07:30 AM, Mon - 31 October 22
సాధారణంగా చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు ఎన్నో విషయాలలో కూడా వాస్తు విషయాలను నమ్ముతూ ఉంటారు. ఇందుకోసం ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో ఉండే వస్తువుల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. కాగా డబ్బుకు సంబంధించిన అనేక వాస్తు చిట్కాలను ఇప్పటికే వాస్తు శాస్త్రంలో తెలిపిన విషయం తెలిసిందే. వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల మొక్కలను అలాగే పువ్వులను ఇంట్లో ఉంచడం ద్వారా అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతూ ఉంటుంది. అలాగే సిరిసంపదలకు అష్టైశ్వర్యాలకు లోటు కూడా ఉండదు.
కాగా భారతదేశంలో హిందువులు మోదుగ చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ చెట్టుకు ఎర్రని పూలు పూస్తాయి. ఈ పువ్వులనే అగ్నిపూలు లేదా పలాస పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పలాస పువ్వును అనేక రకాల విషయాలలో అనగా ఆయుర్వేదంలో రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మోదుగ పువ్వు ప్రతి ఏడాది హోలీ పండుగకు ముందు పూస్తుంది. ఈ పుష్ప అంతే ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం. అలాగే ఈ మోదుగ పువ్వుతో పరిహారం చేస్తే మీ ఇంట్లో దేనికీ కూడా లోటు ఉండదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఈ పలాస పువ్వు కొబ్బరికాయను తెల్లటి గుడ్డలో కట్టి ఇంటిలోని ఖజానా ఉంచే ప్లేస్ లో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. శుక్రవారం సాయంత్రం ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే తాజా పువ్వులు లేని వారు ఎండిన పువ్వులతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. అంతేకాకుండా శుక్రవారం పలాస చెట్టును పూజించడం వల్ల లక్ష్మీ దేవితో సహా అనేక దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇలా కనీసం 5 శుక్రవారాలు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మిదేవి కాసుల వర్షం కురిపిస్తుంది.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.