Vastu Tips For Money: నవరాత్రి వేళ మీ ఇంట్లోకి ఇవి తెస్తే ఇక భోగభాగ్యాలే!!
నవరాత్రి వేళ మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలన్నా.. భోగ భాగ్యాలతో కళకళలు ఆడాలన్నా కొన్ని వస్తువులు కొనాలి.
- By Hashtag U Published Date - 08:30 AM, Wed - 28 September 22
నవరాత్రి వేళ మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలన్నా.. భోగ భాగ్యాలతో కళకళలు ఆడాలన్నా కొన్ని వస్తువులు కొనాలి. మీ ఇంట్లో సరైన చోట, సరైన దిక్కులో ఈ వస్తువులను ఉంచుకోవాలి. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి ? అవి సంపాదించి పెట్టే సిరి సంపదలు ఏమిటి ? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం..
* వెండి ఏనుగు విగ్రహం
వెండి ఏనుగు బొమ్మకు సైజుతో సంబంధం లేదు. ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా సరే.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారట. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయట పడవచ్చు. ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా అభివృద్ధి వుంటుంది. వినాయకుడి ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో వుంచితే విఘ్నాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు చేకూరుతాయి. ఈ బొమ్మ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఏనుగులు రక్షకులుగా వ్యవహరిస్తారు కాబట్టి.. ఏనుగు విగ్రహాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం అదృష్టంగా భావిస్తారు. ఇంటి ప్రవేశ ద్వారం, లోపలికి ఎదురుగా ఒక జత ఏనుగులను ఉంచవచ్చు.
* ఏనుగు పెయింటింగ్స్
ఇంటిని చెడు లేదా ప్రతికూల శక్తి నుండి కాపాడుకోవాలనుకుంటే ఏనుగు పటాలను వుంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. వాస్తు ప్రకారం, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి, పడకగదిలో ఏనుగుల పెయింటింగ్‌ను వేలాడ దీయండి. ఏనుగు పెయింటింగ్స్‌ను స్టడీ రూమ్ లేదా ఆఫీసులో వేలాడదీయడం కూడా అదృష్టంగా భావిస్తారు. మీ పిల్లల గదిలో ఒకదాన్ని వేలాడదీయాలనుకుంటే, తల్లి, పిల్లల ఏనుగుల కలయికను ఎంచుకోండి. ఫెంగ్ షుయ్ ప్రకారం, మీరు వారి జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి మరియు వారి దృష్టి స్థాయిని మెరుగుపరచడానికి వాల్‌పేపర్ లేదా బొమ్మల రూపంలో కూడా బొమ్మను ఉంచవచ్చు. ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు పెయింటింగ్స్ రెండింటిని పెట్టాలి. ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మను ఉంచాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలు తగ్గుతాయి. ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆ పెయింటింగ్స్ ను చూసి వెళ్తే ఆ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
* ఇత్తడి ఏనుగు విగ్రహం
ఇత్తడి ఏనుగుల బొమ్మలను బెడ్రూమ్లో ఉంచడానికి ఉత్తమమైనవిగా భావిస్తారు. ఎందుకంటే ఇది జంటల మధ్య తేడాలను తొలగిస్తుంది. సమావేశ గదిలో ఇత్తడి ఏనుగులను ఉంచడం కార్యాలయంలో శాంతి, శ్రేయస్సును తెస్తుంది. అదనంగా, ఇది జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. ఇక వెండి ఏనుగును ఇంట్లో ఉంచడం అదృష్టం. వెండి ఏనుగు బొమ్మను ఉత్తర దిశలో ఉంచాలి. చిన్న ఇల్లు, కార్యాలయం ఉంటే, మీరు తలుపు లేదా ప్రవేశ స్థలం దగ్గర ఏనుగును కూడా ఉంచవచ్చు.
* ఏ దిక్కులో అయితే బెస్ట్?
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు పెయింటింగ్స్ పెడితే ఇంటికి అదృష్టం, రక్షణ మరియు బలం. పడక గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే ప్రేమ, విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది.హాల్ లేదా పిల్లల గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉత్తర దిశలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే కెరీర్ వృద్ధి చేకూరుతుంది. ఇంటి పైకప్పుపై ఏనుగు విగ్రహం లేదా పటం వుంచితే అదృష్టం, విజయం వర్తిస్తుంది. ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు బొమ్మలను రెండింటిని పెట్టాలి. ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మను ఉంచాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలు తగ్గుతాయి. ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆ బొమ్మలను చూసి వెళ్తే ఆ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.