Vasthu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ 5 తప్పులు చేసి ఉంటె..?
సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ వాస్తు శాస్త్ర విషయంలో కొన్ని రకాల
- By Nakshatra Published Date - 06:30 AM, Sat - 5 November 22
సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ వాస్తు శాస్త్ర విషయంలో కొన్ని రకాల సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మరి ఏ విషయాలలో వాస్తు విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది మనం స్థలాన్ని కొనుగోలు చేసే ముందు నుంచే ఈ వాస్తు విషయాలను గుర్తుంచుకోవాలి. స్థలాన్ని కొనుగోలు చేసే ముందు యజమాని పేరు యజమాని ఇంట్లో భార్య పిల్లల పేర్లు వాళ్లకి నచ్చిన దిశ ఇది అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అందుకు అనుగుణంగా స్థలాన్ని కొనుగోలు చేయాలి.
స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఇంటిని నిర్మించే క్రమంలో బాత్రూం డోర్ ఎక్కడ రావాలి మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని వాస్తు శాస్త్ర ప్రకారంగా ప్లాన్ వేసుకున్న తర్వాత ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి. అదేవిధంగా ఇంటిని నిర్మించుకునే ముందే ఇంట్లో ఎటువంటి కలర్ లని వేయించుకోవాలి అన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఆల్రెడీ కట్టిన ఇంటిని కొనుగోలు చేయడం కంటే ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసి ఇంటికి మనకు నచ్చిన విధంగా కట్టించుకోవచ్చు.
కొంతమంది ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ఇంట్లో కొద్దిరోజులు ఉండిన తర్వాత వాస్తు ప్రకారం గా ఇంటిని అమర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి ఇంట్లో ఉన్న వస్తువులను కదిలించకుండా మెటల్స్ ద్వారా, ఎలిమెంట్స్ ద్వారా వాస్తు ప్రకారంగా ఇంటిని చేసుకోవచ్చు. కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంటిని నిర్మించుకునే ముందు లేదంటే ఇంటిని కొనుగోలు చేసే ముందే వాస్తు విషయాలను గుర్తుంచుకొని ఆ విధంగా మనం రూపొందించుకోవడం మంచిది. అలాగే ఒకవేళ వాస్తు ప్రకారంగా ఇంటిని కట్టించుకుంటే ఎప్పటి నుంచి మంచి ఫలితాలు మొదలవుతాయి అన్న విషయానికి వస్తే.. 40 రోజుల తర్వాత నుంచి ఆ ఫలితాలు కనిపించడం మొదలుపెడతాయి. కొంతమందికి 40 రోజులలోపు ముందుగానే మంచి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
Tags
Related News
Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?
మన వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిం