UPI Transactions: భారీగా పెరిగిన UPI లావాదేవీలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల పర్వం నడుస్తుంది. ఒకానొక సమయంలో డబ్బు చేతులు మారేది. ఇప్పుడు నంబర్ ద్వారా డబ్బు ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 26-09-2023 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
UPI Transactions: దేశంలో డిజిటల్ చెల్లింపుల పర్వం నడుస్తుంది. ఒకానొక సమయంలో డబ్బు చేతులు మారేది. ఇప్పుడు నంబర్ ద్వారా డబ్బు ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు ఊపందుకున్నాయి. సులభమైన పద్దతిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా డబ్బు పంపే సౌకర్యం కారణంగా, దేశంలో దాదాపు ఎక్కువ మంది ప్రజలు నగదు రహిత చెల్లింపులు ప్రారంభించారు.
వరల్డ్‌లైన్ నివేదిక ప్రకారం UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి . గత నెల ఆగస్టులో UPI లావాదేవీలు 10 బిలియన్ల సంఖ్యను అధిగమించింది. ఈ నివేదిక ప్రకారం జనవరి 2018లో UPI లావాదేవీల సంఖ్య 151 మిలియన్లు, ఇది జూన్ 2023 నాటికి 9.3 బిలియన్లకు పెరిగింది.జనవరి 2022లో మొత్తం UPI లావాదేవీలలో P2M లావాదేవీలు 40.3 శాతం ఉండగా, జూన్ 2023లో ఇది 57.5 శాతంగా ఉంది, ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
UPI అంటే ఏమిటి?
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులు మొబైల్ యాప్స్ నుంచి తక్షణమే డబ్బును బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. UPI ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బు పంపడానికి అదనపు ఛార్జీలు ఉండవు . దాదాపు ప్రతి బ్యాంకు మొబైల్ అప్లికేషన్ల ద్వారా UPI లావాదేవీలను అనుమతిస్తుంది. UPI ద్వారా చెల్లింపులు పూర్తిగా సురక్షితం. డబ్బు పంపే ముందు ప్రతిసారీ MPINని నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.
Also Read: AP : జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు