Office : మీరు ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా..? అయితే ఇలా చెయ్యండి
Office : నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న వారు పనికి ఆటంకం కలిగించడమే కాకుండా, మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తారు. అలాంటి వారు ఎవరంటే.. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వారు
- By Sudheer Published Date - 06:38 AM, Mon - 21 April 25

ప్రతిరోజూ ఉద్యోగ జీవితంలో మనం అనేక రకాల వ్యక్తులను ఎదుర్కొంటాం. వారిలో కొంతమంది సహాయకంగా, ప్రోత్సాహకంగా ఉండగా, మరికొంతమంది మాత్రం మనశాంతిని భంగం చేస్తారు. ముఖ్యంగా నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న వారు పనికి ఆటంకం కలిగించడమే కాకుండా, మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తారు. అలాంటి వారు ఎవరంటే.. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వారు, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోని అహంకారులు, నకిలీ నైతికతతో ప్రవర్తించే వారు మొదలైనవారు.
Varuthini Ekadashi: వరూథిని ఏకాదశి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏమిటి?
ఎప్పుడూ తప్పులపై దృష్టి పెట్టే వారు మీ పనిలో ఉన్న లోపాలను వెలికి తీయడమే కాకుండా, అభినందనలు తెలపకుండా నెగటివ్ కామెంట్స్‌తో మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తారు. అహంకారంతో నిండిన వారు తమ తప్పులను అంగీకరించరు. కానీ ఇతరులను తప్పుపడేస్తూ ఉంటారు. అలాగే నకిలీ మనస్తత్వం గల వారు ఎదుటివారిని మోసగించేందుకు ముచ్చటగా ప్రవర్తిస్తూ, మనం వారిని నమ్మేలా చేసి మనపై ప్రతికూల ప్రభావం చూపిస్తారు. వీరి వల్ల మన నైతిక ధైర్యం తగ్గిపోతుంది.
Vishnupriya : విష్ణు ప్రియ ఎదురుకున్న ఇబ్బందికర పరిస్థితి అదేనట
ఇంకా గాసిప్‌లు చేసే వారు, నిజాన్ని వక్రీకరించే వ్యక్తులు కూడా ఆఫీసు వాతావరణాన్ని గందరగోళంగా చేస్తారు. మీ పనిని, నడవడిని తప్పుగా చిత్రీకరించి ఇతరుల వద్ద మీ గురించి దురదృష్టకరమైన అభిప్రాయాలు కలుగజేస్తారు. ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు పనిచేసే చోట విశ్రాంతిగా ఉండలేరు. నిపుణుల సూచన ప్రకారం.. ఇలా ప్రవర్తించే వ్యక్తులకు దూరంగా ఉండటం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆఫీసులో సానుకూల వాతావరణాన్ని పొందాలంటే, నమ్మదగిన, సహాయక సహచరులతోనే సమయం గడపాలని సూచిస్తున్నారు.