Vishnupriya : విష్ణు ప్రియ ఎదురుకున్న ఇబ్బందికర పరిస్థితి అదేనట
Vishnupriya : చిన్నప్పుడు తన నానమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, తన బావ, తమ్ముడు, మరియు మిగతా పిల్లల కంటే తాను, తన సిస్టర్స్ ఎదుర్కొన్న ట్రీట్‌మెంట్ చాలా తేడాగా ఉండేదట
- By Sudheer Published Date - 07:06 PM, Sun - 20 April 25

ప్రముఖ యాంకర్ మరియు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ విష్ణుప్రియ (Vishnupriya) తన అనుభవాలను నెటిజన్లతో పంచుకొని వారిలో ఆవేదనను నింపింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రయాణం అద్భుతంగా సాగింది కానీ టైటిల్ దక్కించుకోలేకపోయినా, అభిమానుల మనసుల్లో తన స్థానం సంపాదించుకుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ, చిన్ననాటి కొన్ని బాధాకర సంఘటనలను గుర్తు చేసుకుంది. తన జీవితంలో ఎదురైన అసమానతలు, వివక్షతల గురించి ఫాలోవర్లతో ఓపెన్‌గా మాట్లాడింది.
Comments On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మెదక్ ఎమ్మెల్యేపై కేసు!
చిన్నప్పుడు తన నానమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, తన బావ, తమ్ముడు, మరియు మిగతా పిల్లల కంటే తాను, తన సిస్టర్స్ ఎదుర్కొన్న ట్రీట్‌మెంట్ చాలా తేడాగా ఉండేదట. వాళ్లకి ఎక్కువ స్వేచ్ఛ, పాకెట్ మనీ ఉండేదట కానీ వీళ్లకి మాత్రం కట్టుబాట్లు, నిబంధనలే ఎక్కువగా ఉండేవి. ఈ అసమానతను గుర్తుచేసుకుంటూ, తన తల్లి జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎలా ఎదురయ్యాయో వివరించింది. వరుసగా అమ్మాయిలకు జన్మనిచ్చినందుకు తన తల్లి ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుంది.
అలాగే ‘హోమ్ టౌన్’ అనే వెబ్ సిరీస్‌ను చూసిన విష్ణుప్రియ, ఆ కథతో తన అనుభవాలు ఎంతగానో జతపడ్డాయని తెలిపింది. ఈ సిరీస్ ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోందని, ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవాళ్లెవరైనా తప్పక చూసి కనెక్ట్ అవుతారని చెప్పింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. చాలా మంది ఆమెకు మద్దతుగా స్పందిస్తూ, ధైర్యంగా తన అనుభవాలను పంచుకున్న విష్ణుప్రియను ప్రశంసిస్తున్నారు.