Ravi Varma : ఖండాలు దాటిన రవివర్మ చిత్రకళ
చిత్ర కళలో రాజా రవివర్మ పేరు తెలియని వారు ఉండరు. ఇతర చిత్రాల్లే కాక రామాయణ, మహాభారత ఘట్టాలను చిత్రాలుగా మల చాడు. భారత సాంప్రదాయా నికి, పాశ్చాచ్య చిత్రకళ సంగ మానికి వీరి చిత్రాలు మచ్చు తునకలు. చీర కట్టు అందాలు, శరీర ఒంపు సొంపులు చిత్రిం చడంలో అందె వేసిన చెయ్యి .
- By CS Rao Published Date - 02:00 PM, Fri - 29 April 22
చిత్ర కళలో రాజా రవివర్మ పేరు తెలియని వారు ఉండరు. ఇతర చిత్రాల్లే కాక రామాయణ, మహాభారత ఘట్టాలను చిత్రాలుగా మల చాడు. భారత సాంప్రదాయా నికి, పాశ్చాచ్య చిత్రకళ సంగ మానికి వీరి చిత్రాలు మచ్చు తునకలు. చీర కట్టు అందాలు, శరీర ఒంపు సొంపులు చిత్రిం చడంలో అందె వేసిన చెయ్యి . 1873 లో వియన్నా లో జరిగిన అంతర్జాతీయ చిత్ర ప్రదర్శన లో మొదటి బహుమతి రావ డంతో మొదటగా ప్రపంచానికి తెలియ వచ్చాడు. వీరు మర ణించే సమయానికి కిలమా నూరు ప్యాలెస్ లో 160 కి పైగా చిత్రాలు ఉండేవట. వాటిని అధికారికంగా తిరువనంత పురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీ కి అందజేసారు. 29 ఏప్రిల్ 18 48 న కేరళ లో కిలమానూరు రాజ ప్రాసాదంలో ఉమాంబ తాంబురాట్టి, నీల కంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు జన్మించాడు. చిన్నతనం లో రవివర్మ చూపించిన ప్రతిభ వల్ల ట్రావెన్ కోర్ మహారాజు అయిల్యం తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థా న చిత్రకారుడు శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేసాడు. తైలవర్ణ చిత్ర కళను బ్రిటీష్ దేశ స్థుడైన థియోడార్ జాన్సన్ వద్ద నేర్చుకున్నాడు. తన చిత్రా ల ఇతి వృత్తాల కోసం భారత్ అంతా పర్యటించాడు. హిందూ దేవతా స్త్రీల చిత్రాల ను, దక్షిణ భారత స్త్రీల లాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటా రని భావించేవాడు. మాహా భారతం నల దమయంతి, శకుంతలా- దుష్యంతులు కథల్లోని ఘట్టాలను చిత్రాలు గా చిత్రించి ఎంతో పేరు సంపా దించాడు. రాజా రవివర్మ పెయింటింగ్స్ వచ్చాక భారతీ యుల ఊహల్లో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలుగా మారిపోయాయి. సరస్వతి, లక్షీదేవి, శివుడు, అనేక దేవ తల చిత్రాల రూపకల్పన రవివర్మే. నేటికీ వాటినే వాడు తున్నారు.
1894 లో లిథో గ్రాఫిక్ యంత్రాలు , చిత్రణకు అనువైన రాళ్లు , సాంకేతిక నిపుణులను జర్మనీ నుండీ తెప్పించాడు రవివర్మ. దేశంలో అత్యాధునిక ప్రింటింగ్ ప్రెస్ ను బొంబాయి లో స్థాపించాడు. స్థలాభావం వల్ల, ప్లేగు వ్యాధి వ్యాపించడం వల్ల కార్మికులు సరిగ్గా రాకపోవడంతో 4 సం. ల. తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ మనవాలి అనే గ్రామాన్ని ఎంచుకుని అక్కడికి మార్చాడు. ప్రింటింగ్ బాగా అభివృద్ధి చెందడంతో కేరళ నుండీ ఆ గ్రామానికి తరచుగా వస్తూ , వెళుతూ ఉండేవాడు. చని పోవడానికి 2 సం.ల. ముందు జర్మన్ స్నేహితునికి విక్రయిం చాడు. అతనికే 100 చిత్రాలపై కాపీరైట్స్ ను కూడా ఇచ్చాడు. 1972 లో జరిగిన అగ్ని ప్రమా దంలో ప్రెస్ కు భారీ నష్ఠం వాటిల్లింది. మిగిలిన చిత్రా లను, రాళ్లను చుట్టు పక్కల వార్కి ఇచ్చి వేసారు. ఆ తరు వాత ముంబై, పూణే ప్రభుత్వా లు కొన్నిటిని భధ్ర పరిచాయి. పల్లె పడుచు, అలోచనలో ఉన్న స్త్రీ, దమయంతి హంస సంవాదం, వాద్యకారుల బృందం , సుభద్రార్జునులు , లేడీ విత్ ఫ్రూట్స్ , హార్ట్ బ్రోకెన్, స్వర్బత్ ప్లేయర్, శకుంతల, శ్రీ కృష్ణ రాయబారం, రావణ – జఠాయు వధ, భిక్షకుల కుటుం బము, లేడీ ప్లేయింగ్ స్వర్బత్, గుడి వద్ద దానం చేస్తున్న స్త్రీ, ఇంద్ర జీత్ విజయం, వరుణు ని జయించిన రాముడు, నాయర్ల స్త్రీ, శృంగారంలో ఉన్న జంట, కీచకుణ్ని కలవడానికి భయపడుతున్న ద్రౌపతి, శంత నుడు- మత్య గంధి, ప్రేమ లేఖ వ్రాస్తున్న శకుంతల, కణ్వు డి ఆశ్రమంలో బాలిక మొదలై నవి పేరు తెచ్చిన చిత్రాలు.
రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ బాగీరధీ భాయి ( కోచుపంగి అమ్మ ) తో వివాహం జరిగింది. ఇద్దరులు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. పెద్ద కుమారుడు రాజా రామవర్మ కూడా చిత్ర కారుడే. ఇతనికి గౌరీ కుంజమ్మ తో వివాహం అయ్యింది. రెండవ కుమార్డు రాజరాజ వర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ . ఈవిడ ట్రావెన్ కూర్ రాణీ సేతు లక్షీ భాయి తల్లి. ఈవిడ రవివర్మ రెండు చిత్రాల్లో కనిపిస్తుంది. రెండవ కుమార్తె ఉమాభాయి. రవివర్మ సంతానం తోటే మావెలికెర రాజ కుటుంబం ఏర్పడింది. ఇంకా మనుమ రాండ్లు ఇద్దరు ట్రావెన్ కూర్ రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. అలా దత్తత వెళ్లిన వారే పైన చెప్పిన రాణీ సేతు లక్ష్మీ భాయి. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్ కూర్ రాజ కుటుంబం. రాజా రవివర్మ చిత్ర కళలో ఒక లెజెండ్ . ఆయన దేవతా చిత్రాలను చూస్తే దివి నుంచీ దిగి వచ్చారా , దేవతలంటే ఇలానే ఉండేవారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సరస్వతీ, లక్ష్మీ దేవిల చిత్తరువులు చూడ గానే , ప్రశాంతమైన వారి ముఖాలను చూడగానే మన చేతులు మనకు తెలియ కుండానే జోడిస్తాము. అదీ రవివర్మ చిత్ర కళలో ఉన్న గొప్పదనం, మహత్యం . 2 అక్టో బర్ 1906 లో కిలమానూర్, కేరళ లో రాజా రవివర్మ మరణించారు. కేరళ ప్రభుత్వం రవివర్మ పేరిట ప్రతి సం. రం. కళలు, సంసృతికి కృషి చేసిన కళాకారులకు పురస్కారం అందిస్తోంది. కేరళ లో మావలికెర లో రవివర్మ పేరిట ఫైన్ ఆర్ట్స్ కళాశాలను ఏర్పాటు చేసారు. రవివర్మ చిత్రాలపై ఇంగ్లీష్ లో 5 పుస్త కాలు, మళయాళం లో 3 పుస్త కాలు వెలువడ్డాయి..
Tags
Related News
World Art Day : కాదేదీ కళకు అనర్హం.. ఏప్రిల్ 15 ప్రపంచ కళా దినోత్సవం..!
పెయింటింగ్ అనేది మనిషి ఎదుగుదలతో అభివృద్ధి చెందింది. నేటికీ మాటల్లో చెప్పలేనిది చిత్రాలలో చెప్పబడింది.