Turmerci Face Mask: ముఖానికి పసుపు రాసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి?
ప్రస్తుత రోజుల్లో అందంగా కనిపించడం కోసం యువత ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అందమైన చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక
- By Anshu Published Date - 09:00 PM, Tue - 18 July 23

ప్రస్తుత రోజుల్లో అందంగా కనిపించడం కోసం యువత ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అందమైన చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు, హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం అమ్మాయిలు చేతులకు కాళ్లకు ఎక్కువగా పసుపును రాసుకుంటూ ఉంటారు. అయితే పసుపు రాసుకోవడం మంచిదే కానీ అందులో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి ముఖానికి కాళ్లకు చేతులకు పసుపు రాసుకునే ముందు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పసుపును రాసుకోవడం వల్ల చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
అలా అని పసుపుతోపాటు ఏవో పదార్థాలను కలిపి చర్మానికి రాయకూడదు. పసుపుతో పాటు రోజ్ వాటర్, మిల్క్, వాటర్ లలో కలపాలి తప్ప మరే ఇతర వస్తువులను కలపకూడదు. అనవసర పదార్థాలను కలపడం మూలాన అవి పసుపుతో చర్య పొంది మన శరీరానికి హాని తలపెట్టే కారకాలుగా మారుతాయి. పసుపును శరీరానికి అప్లై చేయడం చాలా సులువైన పని. కానీ అలా ముఖానికి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలనే విషయం చాలా మందికి సరిగ్గా తెలియదు. ఏ ఫేస్ ప్యాక్లనైనా సరే ముఖానికి అప్లై చేసినపుడు కేవలం 20 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుంది. అన్ని ఫేస్ ప్యాక్ ల మాదిరిగానే పసుపును అప్లై చేసినపపుడు కూడా కేవలం 20 నిమిషాల సేపు ఉంచితే చాలు.
ఎక్కువ సేపు పసుపును ముఖం మీద ఉంచడం వలన ముఖంపై పసుపు చారలు ఏర్పడి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. కావున పసుపును అప్లై చేసినపుడు ఎంత సేపు ఉంచుతున్నామనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో పసుపును స్కిన్ పై అప్లై చేయడం వలన మొటిమలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత సబ్బుతో ముఖం కడుక్కోవచ్చా అన్న అనుమానం చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. కొంత మంది ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసిన తరువాత సబ్బుతో ముఖాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం సరికాదు. పసుపు రాసిన తర్వాత ముఖానికి 24 నుంచి 48 గంటల వరకు సబ్బును రాయకూడదు. పసుపును అప్లై చేయడంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. పసుపు ఫేస్ ప్యాక్ ను వాడే ముందు చాలా మంది ఫేస్ మొత్తానికి సమానంగా రాయరు. ఇలా అసంపూర్తిగా మనం పసుపును అప్లై చేయడం వలన మన ఫేస్ పూర్తి గ్లోను పొందదు. అలాగే పసుపు బాగా రాసిన చోట పసుపు పచ్చగా రాయని చోట నార్మల్గా ఉంటూ అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది.